ధనుష్ తో ఆ హీరోలకు చెక్.. తెరవెనక భారీ ప్లాన్?

తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలని  చాన్నాళ్లుగా ట్రై చేశాడు హీరో సూర్య. కానీ వర్కవుట్ కాలేదు. అజిత్, విజయ్ లాంటి హీరోలు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. విక్రమ్ అయితే…

తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలని  చాన్నాళ్లుగా ట్రై చేశాడు హీరో సూర్య. కానీ వర్కవుట్ కాలేదు. అజిత్, విజయ్ లాంటి హీరోలు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. విక్రమ్ అయితే ఎన్నోసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. 

ఇక శింబు, జీవ, శివకార్తికేయన్ లాంటి హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ముందుకొచ్చినా టాలీవుడ్ ఎంకరేజ్ చేయలేదు. కేవలం కార్తి మాత్రమే దీనికి మినహాయింపు. దశాబ్దాలుగా ఇంత జరుగుతుంటే, సడెన్ గా ఇలా తెరపైకొచ్చి అలా తెలుగులో సినిమాలు ఎనౌన్స్ చేశాడు ధనుష్. దీనికి కారణం ఏంటి?

కోలీవుడ్ లో మార్కెట్ లేక టాలీవుడ్ కు వచ్చాడనుకుంటే తప్పు. ఎందుకంటే కేవలం మార్కెట్ మాత్రమే కాదు, రజనీకాంత్ అల్లుడిగా ధనుష్ కు అక్కడ భారీ క్రేజ్ ఉంది. విలక్షణ నటుడిగా ఓ మంచి గుర్తింపు ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సక్సెస్ లు కూడా పడుతున్నాయి. మరి ఇంత సెడెన్ గా టాలీవుడ్ కు ఎందుకొచ్చినట్టు?

పోనీ పాన్ ఇండియా అప్పీల్ కోసం ధనుష్ ఇలా చేశాడనుకుంటే అది కూడా తప్పు. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ లో అడుగుపెట్టాడు ఈ హీరో. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ మూవీ కూడా చేస్తున్నాడు. టాలీవుడ్ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ధనుష్ కు లేదు. మరి ధనుష్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? ఆయన తెలుగు సినిమాపై కన్నేశాడు అనేకంటే, టాలీవుడ్ లో కొందరు ధనుష్ ను కావాలని తెరపైకి తీసుకొచ్చారనడం కరెక్ట్.

అవును.. టాలీవుడ్ లో కొందరు 'పెద్ద మనుషులు' వేసిన ఎత్తుగడగా ఇది కనిపిస్తోంది. ఈమధ్య కాలంలో హీరోలంతా రేట్లు పెంచేశారు. అంతగా సక్సెస్ ట్రాక్ లేని హీరోలు కూడా రెమ్యూనరేషన్లు పెంచేశారు. మహేష్, పవన్, రవితేజ లాంటి హీరోల పేర్లు మాత్రమే తెరపై కనిపించాయి. కానీ లోతుగా చూస్తే ఒకట్రెండు హిట్స్ కొట్టిన హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా తమ పారితోషికాలు సవరించారు. వాళ్లతో సినిమా తీస్తే మూవీ హిట్టయినా నిర్మాతకు మిగిలేది అరకొరగానే.

ఇలాంటి టైమ్ లో ఆ ''కొంతమంది'' హీరోలకు చెక్ పెట్టాలంటే బయట నుంచి మరో హీరోను దించాల్సిందే. అందుకే ధనుష్ ఎంట్రీ జరిగిందంటున్నారు చాలామంది. శేఖర్ కమ్ములతో సినిమా ఎనౌన్స్ చేసిన ధనుష్, వెంటనే తెలుగులోనే మరో సినిమా కూడా ప్రకటించడానికి ఇదే కారణం అని చెబుతున్నారు.

పారితోషికం పరంగా ధనుష్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఓ స్టార్ హీరో తీసుకుంటున్న ఎమౌంట్ లో సగానికే సినిమా చేస్తున్నాడు. అందుకే కొంతమంది టాలీవుడ్ జనాలు ఇప్పుడు ధనుష్ ను ఎగదోస్తున్నారు. 

తెలుగులో అతడికి మార్కెట్ క్రియేట్ చేసే పనిని తెరవెనక దిగ్విజయంగా స్టార్ట్ చేశారు. కోలీవుడ్ లో కూడా మార్కెట్ పెంచుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నంగా ఇది పైకి కనిపిస్తున్నప్పటికీ.. కొంతమంది హీరోలకు చెక్ పెట్టేందుకే ఈ మార్పు జరుగుతోందని తెరవెనక గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాకపోతే ధనుష్ ను దించి టార్గెట్ చేయాలనుకున్న 'ఆ హీరోలు' ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. టాలీవుడ్ లో సీక్రెట్స్ దాగవు. ఇప్పుడు కాకపోతే రేపైనా 'ఆ హీరోల' పేర్లు బయటపడతాయి.