cloudfront

Advertisement


Home > Movies - Movie News

మీటూ.. నటుడికి ఊరట దొరికింది!

మీటూ.. నటుడికి ఊరట దొరికింది!

బాలీవుడ్ సినిమాల్లో తండ్రి పాత్రలతో ఫేమస్ అయిన అలోక్ నాథ్ ఇటీవల ఒక రేప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మీటూ వ్యవహారాల హీట్ పెరిగినప్పుడు.. అలోక్ నాథ్ పై వింటా నందా అనే ఆమె రేప్ కేసు పెట్టింది. 19 సంవత్సరాల కిందట తనపై అలోక్ నాథ్ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అప్పట్లో తను బయటకు చెప్పుకోలేకపోయానని.. ఇప్పుడు మీటూ అంటున్నట్టుగా ఆమె ప్రకటించింది.

సంస్కారీ ఫాదర్ పాత్రలతో బాగా ఫేమస్ అయిన అలోక్ నాథ్ అలాంటి కేసులో ఇరుక్కోవడం విశేషంగా నిలిచింది. అయితే తనకే పాపం తెలియదని అలోక్ నాథ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో పరువు నష్టం దావాను కూడా వేశాడు. అలోక్ నాథ్ వెంట ఆయన భార్య సైతం వచ్చింది.

ఇక వింటా నందా పెట్టిన కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. వింటా నందా చేసిన ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఏ రోజు అత్యాచారం జరిగింది.. అనే అంశంపై కూడా ఆమె స్పష్టతను ఇవ్వలేకపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.

అత్యాచారం తన ఇంట్లోనే జరిగినట్టుగా ఆమె చెప్పిందని, అందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ చూపలేకపోతోందని.. వ్యాఖ్యానించింది. ఈ కేసులో అలోక్ నాథ్ కు ముందస్తు బెయిల్ కూడా గ్రాంట్ చేసింది కోర్టు. ఒకవేళ అత్యాచారం జరిగి ఉన్నా.. ఆమె ఉద్దేశపూర్వకంగానే అప్పుడు బయట పెట్టకపోయుండవచ్చనే వ్యాఖ్యానం కూడా ఈ కేసులో వినిపిస్తోంది.

అలోక్ నాథ్ ప్రముఖ నటుడు అయినందున అప్పుడు తను బయటపడలేదని ఆమె చెప్పుకొస్తోంది. ఇది అసంబద్ధమైన వాదన అవుతోంది. అలా అంటే.. అలోక్ నాథ్ ను దెబ్బతీసేందుకు ఇప్పుడు తప్పుడు ఆరోపణ కూడా చేస్తుండవచ్చు కదా.. అనేవాదనా వినిపిస్తోంది. ఇలా మీటూ వ్యవహారంలో  కోర్టు వరకూ వెళ్లిన కేసు నీరుగారిపోయేలా ఉంది!

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!