Advertisement

Advertisement


Home > Movies - Movie News

రేణు దేశాయ్ కేరాఫ్ పీపుల్స్ మీడియా

రేణు దేశాయ్ కేరాఫ్ పీపుల్స్ మీడియా

పీపుల్స్ మీడియా సంస్థకు పవన్ కళ్యాణ్‌కు మంచి బంధాలు వున్నాయి. అవి ఎలా అంటే పీపుల్స్ మీడియా సంస్థకు నాదెండ్ల మనోహర్ కు మంచి స్నేహం వుంది. ఇంకా గమ్మత్తేమిటంటే పీపుల్స్ మీడియా అధినేత కుటుంబానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కి మధ్య మంచి స్నేహబాంధవ్యాలు వున్నాయి. మొత్తం మీద ఇలా ఒకరితో ఒకరు మంచి సంబంధాలు కలిగి వున్నారు. అదీ సంగతి.

ఇలాంటి నేపథ్యంలో రేణుదేశాయ్ ఇప్పుడు పీపుల్స్ మీడియాలోనే వుంటున్నారు. తెలుగులో ఓ సినిమా చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నారు. పీపుల్స్ మీడియానే అనేక సినిమాలు చేస్తోంది. కావాలంటే వాటిలో ఏదో ఒకటి ఆమె ఎంచుకుని చూసుకోవచ్చు. కాదూ అంటే స్వంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే పీపుల్స్ మీడియా ఆఫీస్ లోనే ఓ క్యాబిన్‌ను రేణు దేశాయ్‌కు కేటాయించారు.

మంచి రోజు చూసుకుని కేబిన్ ప్రవేశం చేసి వెళ్లారు. ఇకపై అక్కడే వుండి తన సినిమా నిర్మాణ పనులు చూసుకుంటారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులు అయిన ఆయన భార్య, కుమార్తె కూడా సినిమాల నిర్మాణం మీద యాక్టివ్ గా దృష్టి పెట్టారు. ఆ విధంగా పీపుల్స్ మీడియా ఫ్యామిలీ మీడియాగా మారుతోందన్న మాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?