cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

వర్మ హీరోయిన్లకు ఉపాధి

వర్మ హీరోయిన్లకు ఉపాధి

వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసినంతవరకు మాత్రమే అందులో నటించిన హీరోయిన్లకు క్రేజ్. ఎందుకంటే తన సినిమాలకు ఎలా ప్రచారం చేసుకోవాలో వర్మకు బాగా తెలుసు. ఆ తర్వాత వర్మ హీరోయిన్లు క్లిక్ అయిన దాఖలాలు ఈమధ్య కాలంలో ఎక్కడా లేవు. అరకొరగా 2-3 సినిమాలు చేయడం, తర్వాత దుకాణం సర్దేయడం మాత్రమే ఆనవాయితీ. తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు ఇదే కోవలో అపసోపాలు పడుతున్నారు.

లాక్ డౌన్ టైమ్ లో అప్సర రాణి అనే హీరోయిన్ ను పరిచయం చేశాడు వర్మ. ఆమె అప్పటికే హీరోయిన్ గా ఓ సినిమా చేసినప్పటికీ పేరు మార్చి, యమ హాట్ గా ప్రజెంట్ చేశాడు. ఆమెను పెట్టి  థ్రిల్లర్ అనే సినిమా తీశాడు. ఆ మూవీ తర్వాత మళ్లీ అప్సర రాణికి అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఆదుకున్నాడు రవితేజ. ఆమెను తీసుకొచ్చి ఐటెంసాంగ్ ఆఫర్ ఇచ్చాడు. క్రాక్ సినిమాలో అప్సర రాణి ఐటెంసాంగ్ చేస్తోంది.

ఇక వర్మ పరిచయం చేసిన మరో హీరోయిన్ శ్రీ రాపాక. నగ్నం సినిమాతో ఈమెను అడల్ట్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశాడు వర్మ. ఆ ఇమేజ్ తో ఇప్పుడీ ఆంధ్రా అందగత్తె మరో అడల్ట్ మూవీ దక్కించుకుంది. దీని పేరు లస్ట్.

ఇది కూడా గతంలో వర్మ తీసిన నగ్నం సినిమాకు ఏమాత్రం తీససిపోదు. అడల్ట్ కంటెంట్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో అలా సెట్ అయిపోయింది శ్రీ రాపాక. ఇంకా చెప్పాలంటే శ్రీ రాపాకను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాకు రూపకల్పన చేసినట్టుంది.

మొత్తమ్మీద ఇలా వర్మ పరిచయం చేసిన ఇద్దరు హీరోయిన్లు ప్రస్తుతానికి చెరో అవకాశమైతే  దక్కించుకోగలిగారు. వీళ్లు ఎన్నాళ్లిలా తమ కెరీర్ బండి లాగిస్తారో చూడాలి.

నన్నెవడూ పీకలేడు

 


×