cloudfront

Advertisement


Home > Movies - Movie News

అందగత్తెల్ని వదిలేసి ఎన్టీఆర్ నిన్నెలా పెళ్లాడాడు?

అందగత్తెల్ని వదిలేసి ఎన్టీఆర్ నిన్నెలా పెళ్లాడాడు?

లక్ష్మీపార్వతిని స్టేజ్ మీద పెట్టుకుని మరీ ఆమెపై జోకులు వేసి నవ్వించాడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ వేదికపై మళ్లీ మునుపటి జోష్ తో మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. తనదైన లాజిక్కులతో, ప్రశ్నలు అడిగిన రిపోర్టర్స్ కి చుక్కలు చూపించాడు. తన ప్రసంగాన్ని ముగిస్తూ సినిమాల్లో శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి అందగత్తెలతో నటించిన ఎన్టీఆర్... వాళ్లని పక్కనపెట్టి నిన్నెలా పెళ్లి చేసుకున్నాడని లక్ష్మీపార్వతిని ప్రశ్నించాడు.

"ఆ ముగ్గురు అందగత్తెల్ని పక్కకు నెట్టేసి, మీ పర్సనాల్టీతో ఆయన్ను ఆకట్టుకున్నందుకు నేను చింతిస్తున్నా"నని అన్నాడు. ఎందుకంటే ఆ ముగ్గురు అందగత్తెలకు తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు. అయితే లక్ష్మీపార్వతి వల్లే ఈరోజు ఓ గొప్ప సినిమా తీసే అవకాశం తనకు వచ్చిందని కవర్ చేశాడు వర్మ.

ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ కి పోటీగా 2019 జనవరి 24న తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు వర్మ. వైఎస్సార్సీపీ ఈ సినిమాకు బ్యాక్ ఎండ్ లో ఉందనే మాట అవాస్తవం అన్నాడు. నిర్మాతలకి వైసీపీ పార్టీకి సంబంధం ఉండొచ్చు కానీ, వైసీపీకి తన సినిమాకి సంబంధం లేదని స్పష్టంచేశాడు.

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ శ్రీవారి ఆశీస్సులు తీసుకుని మరీ వివాదాల తేనెతుట్టె కదిపాడు. అది కూడా ఎన్నికల సీజన్లో పొలిటికల్ టెంపరేచర్ ని హీటెక్కించేలా మాట్లాడాడు. ఇంతకీ వర్మ సినిమా లక్ష్మీపార్వతి పొలిటికల్ కెరీర్ లాగే ఫ్లాపవుతుందా లేక సంచలనాలకు కేంద్రబిందువై ఎన్టీఆర్ బయోపిక్ ని వెనక్కు నెట్టి రికార్డ్ లు సృష్టిస్తుందా..? జనవరి 24న లెక్క తేలిపోతుంది.