cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

వర్మస్ లక్ష్మీపార్వతి.. ఈమె!

వర్మస్ లక్ష్మీపార్వతి.. ఈమె!

తను తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టైటిల్ రోల్ లక్ష్మీపార్వతి పాత్రకు నటిని ఎంపిక చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీ యూట్యూబ్ లో పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అసలు ఈ సినిమా వస్తుందా? రాదా? అనేది సందేహాస్పదమైన విషయమే.

ఈ నేపథ్యంలో తాజాగా తన సినిమాలో లక్ష్మీపార్వతిగా ఎవరు నటించబోతున్నారో వర్మ చెప్పాడు. ఆమె ఫోటోస్ ను కూడా విడుదల చేశాడు. ఇదివరకూ వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ లో.. ఆ గంధపు చెక్కల దొంగ భార్య పాత్రను చేయించిన నటితోనే వర్మ ఇప్పుడు లక్ష్మీపార్వతి పాత్రను చేయిస్తున్నాడట.

ఆమె పేరు యజ్ఞ షెట్టి. అలాగే తన సినిమాలో మరో కీలకపాత్రకు సంబంధించిన పాత్రధారి అంటూ ఇంకో నటుడి ఫొటోను కూడా ఆర్జీవీ షేర్ చేశాడు. అతడు చంద్రబాబు నాయుడి పాత్రను చేస్తున్నాడని స్పష్టం అవుతోంది.

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?