Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఐదారు సినిమాలు తీసినా త‌ర‌గ‌ని క‌థ

ఐదారు సినిమాలు తీసినా త‌ర‌గ‌ని క‌థ

ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో "కొండా" సినిమా తెర‌కెక్కింది. కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్, మాజీ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళీధ‌ర్‌రావు బ‌యోగ్ర‌ఫీ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ నెల 23న సినిమా విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌, కొండా సురేఖ‌, ఆమె కుమార్తె సుస్మిత త‌దిత‌రులు ఇవాళ విజ‌య‌వాడ వ‌చ్చారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంత‌రం ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ‌, ముర‌ళీధ‌ర్‌రావు జీవితంలో ఐదారు సినిమాలు తీసినా తర‌గ‌ని క‌థ ఉంద‌న్నారు. విజ‌య‌వాడ‌తో త‌న అనుబంధం గురించి అంద‌రికీ తెలుస‌న్నారు. ఇంజ‌నీరింగ్ చ‌దివిన నాలుగేళ్ల‌లో ఎప్పుడూ క‌న‌క‌దుర్గ ఆల‌యానికి రాలేద‌న్నారు. మొద‌టిసారి కొండా కుటుంబం ద‌య వ‌ల్ల అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్టు ఆర్జీవీ తెలిపారు.

కొండా కుటుంబ విశ్వాసాలు త‌న‌లో ఇంజెక్ట్ అయి, భ‌క్తిపార‌వ‌శ్యంతో పాటు అనుభూతికి లోనై ఆల‌యానికి వ‌చ్చిన‌ట్టు చెప్పుకొచ్చారు. నుదుట బొట్టు, అమ్మ‌వారికి దండం పెట్ట‌డానికి సురేఖ‌మ్మ‌, సుస్మిత కార‌ణ‌మ‌న్నారు. కొండా దంప‌తుల‌ను క‌లిసి మాట్లాడిన త‌ర్వాత క‌లిగిన పెద్ద ఇన్‌స్ఫిరేష‌న్‌తో కొండా సినిమా తీసిన‌ట్టు వ‌ర్మ చెప్పారు.

సినిమా ఎలా ఉండ‌బోతోంది, కొండా ముర‌ళి హీరోనా, విల‌నా అని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ త‌న మార్క్ కొంటె స‌మాధానాలు ఇచ్చారు.

తిన‌బోతు రుచి చూడ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అలాగే కొండా ముర‌ళి ...కొండా ముర‌ళీనే అని చెప్పారు. ఆయ‌న్ను ఎలా చూస్తే అలా క‌నిపిస్తార‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. సినిమా హిట్ కావాల‌ని కోరుకున్నాన‌ని, మీ మీద ఒట్టు అని ప్ర‌శ్నించిన మీడియా ప్రతినిధితో అన‌డంతో అంద‌రూ న‌వ్వారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?