Advertisement


Home > Movies - Movie News
మెగా కాంపౌండ్ లోకి బాక్సింగ్ బ్యూటీ

మొదటి సినిమాతో సక్సెస్ కొట్టినప్పటికీ ఎందుకో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్. ఎట్టకేలకు ఆమెకు మెగా కాంపౌండ్ లో అవకాశం వచ్చేలా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రానున్న సినిమాలో రితికాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చిత్రలహరి అనే సినిమా ప్లాన్ చేశాడు కిషోర్ తిరుమల. ఈ సినిమా స్టోరీని ఫోన్ ద్వారా రితికా సింగ్ కు వివరించాడు. వెంటనే ఆమె ఇందులో నటించడానికి అంగీకరించింది. జులై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

నిజానికి ఈ ప్రాజెక్టులో అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నాడు కిషోర్ తిరుమల. గతంలో ఆమెతో కలిసి ఉన్నది ఒకటే జిందగీ సినిమా చేశాడు. అందుకే ఆమెనే మరోసారి రిపీట్ చేయాలనుకున్నాడు. కానీ సాయిధరమ్ తేజ్, అనుపమ కాంబోలో తేజ్ ఐ లవ్ యు సినిమా రెడీ అయింది. వెంటనే మరోసారి ఆమెను రిపీట్ చేయడం ఇష్టంలేక, అను స్థానంలో రితికా సింగ్ ను సెలక్ట్ చేశారు.

ప్రస్తుతం రితికా సింగ్ చేతిలో ఒకే ఒక్క తమిళ సినిమా ఉంది. అది కూడా మరో 2 వారాల్లో పూర్తయిపోతుంది. ఆ వెంటనే సాయిధరమ్ తేజ్ సినిమాకు షిఫ్ట్ అవుతుంది రితిక.