cloudfront

Advertisement


Home > Movies - Movie News

రేణుదేశాయ్‌ రీఎంట్రీ కన్‌ఫామ్‌

రేణుదేశాయ్‌ రీఎంట్రీ కన్‌ఫామ్‌

తెలుగులో మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది రేణుదేశాయ్‌. తాను ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించేసింది కూడా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాతో రేణుదేశాయ్‌ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. పవన్‌కళ్యాణ్‌ సరసన 'బద్రి', 'జానీ' సినిమాల్లో నటించిన రేణుదేశాయ్‌ ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమైన విషయం విదితమే. పవన్‌కళ్యాణ్‌తో సహజీవనం, పెళ్ళి, ఆ తర్వాత విడాకులు.. ఇటీవలే మళ్ళీ పెళ్ళికి రేణుదేశాయ్‌ సిద్ధమవడం తెల్సిన విషయాలే.

ఈ మధ్యనే ఓ డాన్స్‌ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చిన రేణుదేశాయ్‌, మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవడం విశేషమే మరి. రేణుదేశాయ్‌ పెదవి విప్పితేచాలు, ఘాటైన విమర్శలతో విరుచుకుపడిపోతుంటారు పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పేరుతో కొందరు. మరి, వాళ్ళంతా రేణుదేశాయ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీ-ఎంట్రీ ఇస్తే ఇంకెంతలా రెచ్చిపోతారో ఏమో.! ఎవరిగోల ఎలావున్నా, రేణుదేశాయ్‌ మాత్రం తిరిగి సినిమాల్లో నటించాలనే తన కోరికను తీర్చుకోబోతోంది.

కాగా, సంఘ సంస్కర్తగా పేరొందిన హేమలత లవణం పాత్రలో రేణుదేశాయ్‌ నటిస్తోంది. గుర్రం జాషువా కుమార్తె అయిన హేమలత లవణం, రచయిత్రిగానూ పేరు ప్రఖ్యాతులు పొందారు. అంటరానితనానికి వ్యతిరేకంగా నినదించారామె. అలాంటి పాత్రలో రేణుదేశాయ్‌ నటించడమంటే విశేషమే మరి. ఈ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'దొంగాట' ఫేం వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాల్లో మళ్ళీ నటించాలన్న కోరిక ఇలా తీరుతోందనీ, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్‌ చెబుతున్నాననీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది రేణుదేశాయ్‌.

అన్నట్టు, రేణుదేశాయ్‌కి సైతం కవితలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇంగ్లీషులో తాను రాసిన కవితల్ని తెలుగులోకి ఇటీవల తర్జుమా చేయించుకున్నారామె. ప్రముఖ సినీపాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌, రేణుదేశాయ్‌ ఇంగ్లీషు కవితల్ని తెలుగులోకి అనువదించాడు.  

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?