Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్ కు మరో అడ్డంకి

ఆర్ఆర్ఆర్ కు మరో అడ్డంకి

సంక్రాంతి బరిలోకి దిగుతుంది ఆర్ఆర్ఆర్ అన్నది గత కొన్నాళ్లుగా వార్తల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్-చరణ్ ల ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలోకి దిగితే ఇప్పటికే షెడ్యూలు చేసుకున్న సినిమాలు తప్పుకోవాల్సి వుంటుందని అనుకుంటున్నారంతా. అయితే ఆర్ఆర్ఆర్ అసలు టార్గెట్ 2022 ఉగాది అని కూడా గ్యాసిప్ లు వున్నాయి.

ఇదిలా వుంటే తమిళనాట సూపర్ స్టార్ అజిత్ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించేసారు. అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “వలిమై” ను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. 

తెలుగు సినిమాలంటే హీరోలతో మొహమాటమో, దర్శకుడితో అనుబంధమో వుండి పక్కకు తప్పుకుంటాయి. కానీ తమిళ నాట అలా జరగదు. పైగా అజిత్ సినిమా వుంటే తెలుగు సినిమాకు థియేటర్లు, స్క్రీన్ లు దొరకడం అన్నది అంతంతమాత్రం. 

గతంలో ఈ విషయం అనేకసార్లు ప్రూవ్ అయింది కూడా. అందువల్ల ఆర్ఆర్ఆర్ తమిళ వెర్షన్ భారీ విడుదల అన్నది కాస్త ఇబ్బంది అవుతుంది. 

దర్శకుడు రాజమౌళి వరల్డ్ థియేటర్ పరిస్థితి బాగుపడ్డాక విడుదల చేస్తామని ప్రకటించారు కనుక, అదెప్పుడు అన్నది ఎదురుచూడడమే. ఈ లోగా ఒక్కో భాషలో ఒక్కో భారీ సినిమా డేట్ లు వస్తూ వుంటాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?