Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్-ఆచార్య ట్రయిల్ షూట్

ఆర్ఆర్ఆర్-ఆచార్య ట్రయిల్ షూట్

సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ సమస్య తీరిపోయినట్లే. ఇవ్వాళ నుంచో, రేపటి నుంచో పోస్ట్ ప్రొడక్షన్ లు మొదలయిపోతాయి. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కు పెద్దగా మ్యాన్ పవర్ అవసరం వుండదు. ఒక్క లైవ్ రికార్డింగ్, లైవ్ ఆర్కెస్ట్రా లాంటివి వుంటే తప్ప జనాలు పెద్దగా అవసరం వుండదు. గుమి గూడరు. కానీ షూటింగ్ లు అంటే అలా కాదు. వందలాది మందితో పని. అందుకే అనుమతుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించేది.

మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జరిగిన ఇండస్ట్రీ యాక్టివ్ ప్రొడ్యూసర్లు (ఒక్కరిద్దరు మినహా) పాల్గొన్న సమావేశంలో ఈ విషయం బాగా డిస్కస్ చేసారు. ఈ సందర్భంగా ఓ ప్రతిపాదన కూడా వచ్చింది. పెద్ద సినిమాలు ఆర్ఆర్ఆర్, ఆచార్య షూటింగ్ లను వీలయినంత తక్కువ మందితో ఒక రోజు మాక్ (ట్రయిల్) షూట్ చేయాలని నిర్ణయించారు.

సాధారణంగా 250 మంది వుంటారు రాజమౌళి, కొరటాల శివ లాంటి దర్శకుల సినిమాలు అంటే. అలాంటిది కేవలం 100 మందితో షూట్ చేయడానికి ప్రయత్నించాలి. వీలయినంత వరకు క్రూ ను తగ్గించి, వందకు పరిమతం చేసి షూట్ చేయాలి. మిగిలిన నిర్మాతలు ఈ షూటింగ్ ను పరిశీలించి, అది మార్గ దర్శకంగా మార్చుకోవాలి. ఇదీ ఆలోచన. ఈ మేరకు త్వరలో ఓ రోజు షూటింగ్ ఆ రెండు సినిమాలకు నిర్వహించే అవకాశం వుంది.

అది ఓకె అనుకుంటే, కొంత మందికి ఓ రోజు, మరి కొంత మందికి మరో రోజు ఇలా ఆల్టర్ నేటివ్ గా పని కల్పిస్తారు. బహుశా జూన్ 1 నుంచి ఈ విధంగా షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం వుంది.

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?