ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం..అంటాడు మహా కవి శ్రీశ్రీ. సెలబ్రిటీల మీద కామెంట్లు అయినా, సినిమా సమీక్షలు అయినా, పొలిటికల్ సెటైర్లు అయినా అన్నీ ఈ ఒక్క లైన్ కిందకే వస్తాయి.
ప్రొడక్ట్ రివ్యూ అన్నది కామన్. అది ఏ ప్రొడక్ట్ అయినా. సినిమా కూడా ఓ ప్రొడక్ట్ కిందకే వస్తుంది. అయితే పెర్ ఫెక్ట్ రివ్యూ, స్టిక్ టు ది సబ్జెక్ట్, ఇలా అనేకానేక కనిపించని గైడ్ లైన్స్ వుంటాయి. అదంతా వేరే సంగతి.
సినిమా జనాలకు సమీక్షల మీద, సమీక్షకుల మీద కోపం వున్నా ఎప్పడో కానీ, ఎవ్వరో కానీ బరస్ట్ కారు. అంతా ఆల్ ఇన్ ద గేమ్ అన్నట్లు వెళ్లిపోతూ వుంటుంది. లేటెస్ట్ గా ఈ విషయంలో కొత్త టర్నింగ్ పాయింట్ వచ్చింది.
ఎప్పడయితే యూ ట్యూబ్ లో విజువల్ రివ్యూలు వచ్చాయో, ఎవరి స్టయిల్ ను వారు చూపిస్తున్నారు. అందులో ఒక్కోసారి సెటైర్లు హద్దులు దాటుతున్నాయి. కానీ నవ్వులు కురిపించి, వ్యూవర్స్ ను ఆకట్టుకోవడం కోసం విజవల్ రివ్యూవర్లు కాస్త లైన్ క్రాస్ చేస్తూ వుంటారు.
ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే బాలీవుడ్ విజువల్ రివ్యూవర్ కే ఆర్ కే కు హీరో సల్మాన్ ఖాన్ లీగల్ నోటీస్ పంపించారు. కె ఆర్ కే సమీక్ష వల్ల తన పరువునష్టం అయిందని పేర్కొంటూ సల్మాన్ లీగల్ టీమ్ నోటీస్ పంపించింది. ఈ మేరకు కె ఆర్ కే ఓ ట్వీట్ వేసారు. ' మా సినిమా సమీక్షించవద్దు అని ఎవరన్నా ముందే చెప్పేస్తే నేను అస్సలు టచ్ చేయను. ఇకపై సల్మాన్ సినిమాలు సమీక్షించబోను' అనే అర్థంలో ఓ ట్వీట్ ను కే ఆర్ కే వేయడం విశేషం.
మొత్తం మీద రాధే సినిమా దారుణ పరాజయం సల్మన్ కు ఎక్కడో కాస్త ఘాటుగానే మండించినట్లు కనిపిస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో జి 5, జి ప్లెక్స్ లో విడుదలయిన ఈ సినిమా దారుణమైన ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. సౌత్ సినిమాలను మిక్సీలో వేసి తిప్పి, నార్త్ లో అందించే డైరక్టర్ గా విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుదేవా దీనికి దర్శకుడు.