cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

స‌ల్మాన్‌ను వేటాడుతున్న గాయ‌ని

స‌ల్మాన్‌ను వేటాడుతున్న గాయ‌ని

బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు, కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌ను ఓ గాయ‌ని వేటాడుతోంది. కృష్ణ జింక‌ల‌ను వేటాడిన కేసులో నిందితుడైన స‌ల్మాన్‌ను ఓ గాయ‌ని వేటాడుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 1998వ సంవ‌త్స‌రంలో  ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసును జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా బెయిలుపై విడుద‌లైన విష‌యం తెలిసిందే. త‌ర‌చూ ఆయ‌న కోర్టుకు హాజ‌ర‌వుతుంటారు.

వేటాడిన కేసులో ఉన్న స‌ల్మాన్‌ఖాన్‌నే వేటాడుతున్న ఆ గాయ‌ని గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే. ఆ గాయ‌ని సోనా మ‌హాపాత్ర‌. స‌ల్మాన్ ఏ త‌ప్పు చేస్తాడా అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది.  ఓ యువ‌తిపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆమె ముఖంపై యాసిడ్ పోసిన‌ట్టు  చూపిస్తూ చేసిన ఓ టిక్‌టాక్ వీడియో తాజాగా తీవ్ర విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది. ఈ వీడియోపై నెటి జ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వీడియో మహిళలపై యాసిడ్‌ దాడిని ప్రోత్సహించేలా ఉందని, దీనిని తొలగించాలని  నెటిజన్లు సోష‌ల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గాయ‌ని  సోనా స్పందిస్తూ.....

"మహిళలను కించపరచడం, హింసించడం ఎప్పట్నుంచో ఉంది. అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. మన స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను మనం చూస్తూనే ఉన్నాం. ఆయన తన స్నేహితురాళ్ల తలలపై బహిరంగంగానే సీసాలు పగలగొట్టిన ఘటనలను చాలా సార్లు చుశాం. అయినప్పటికీ ఆయన ఓ పెద్ద హీరో. ఈ పరిస్థితి ఇప్పటికైనా మారాలి" అంటూ సోనా ట్వీట్ చేసింది.  సల్మాన్‌పై సోనా తీవ్ర విమర్శలు చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు.

గ‌తంలో అనేక సార్లు ఆమె స‌ల్మాన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు ఆ హింసాత్మ‌క వీడియో వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి దాన్ని తీసుకుని స‌ల్మాన్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం సోనాకే చెల్లింది. ఈమె విమ‌ర్శ‌లు చూస్తే...స‌ల్మాన్‌ఖానే ఆ టిక్‌టాక్ వీడియో చేశార‌ని అనుకునే ప్ర‌మాదం లేక‌పోలేదు. 

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష