cloudfront

Advertisement


Home > Movies - Movie News

సల్మాన్, కత్రినా.. రొమాంటిక్‌!

 సల్మాన్, కత్రినా.. రొమాంటిక్‌!

బాలీవుడ్ ‘భరత్’సినిమాకు సంబంధించి, ఆ సినిమా హీరో సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేసిన పోజుకు ఫాలోయర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో మరోసారి కత్రినాతో జతకట్టాడు సల్లూ. వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఆమె తప్పుకుంది.

దీంతో సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా తెరమీదకు వచ్చింది. సల్మాన్ అడిగితే నో చెప్పలేని కత్రినా మరోసారి అతడితో జతకట్టింది. తాజాగా వీరిద్దరి స్టిల్ అధికారికంగా విడుదల అయ్యింది. ఇది చాలా రొమాంటిక్ అంటున్నారు సల్లూ ఫాలోయర్లు.

విశేషం ఏమిటంటే.. ఈ పోజును సల్లూ పోస్టు చేసిన ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రమ్‌లో ఏకంగా 15లక్షల లైక్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రమ్‌లోనే ఇంత మందికి నచ్చిందంటే.. ఓవరాల్‌గా సల్లూ, కత్రినాల జోడి ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టే.