Advertisement

Advertisement


Home > Movies - Movie News

బురదతో సల్మాన్.. పరువు మొత్తం గోవిందా

బురదతో సల్మాన్.. పరువు మొత్తం గోవిందా

టైమ్ బాగోలేనప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. సరిగ్గా సల్మాన్ ఖాన్ కి కూడా అలాగే జరిగింది, జరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో చాలామందికి సల్మాన్ ఖాన్ ఓపెన్ టార్గెట్ అయ్యాడు. బాలీవుడ్ లో బంధుప్రీతి వల్లే ఆయన చనిపోయాడని, దానికి ముఖ్య కారణం సల్మాన్ ఖానేనని విమర్శలొచ్చాయి. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో సల్మాన్ పెట్టిన ఓ పోస్ట్ అతడికే రివర్స్ లో తగిలింది. పరువు మొత్తం పోగొట్టుకున్నట్టయింది.

తాజాగా సల్మాన్ ఖాన్ 'రెస్పెక్ట్ టు ఆల్ ది ఫార్మర్స్' అంటూ ట్విట్టట్ లో ఓ స్టిల్ రిలీజ్ చేశాడు. ఒంటినిండా బురద పూసుకున్న సల్మాన్ తలదించుకుని ఉన్న లుక్ అది. రైతులపై తనకెంతో గౌరవం ఉందని, అందుకే పొలంలో పనిచేసి బురదతో ఫొటో దిగాననేది ఆయన ఆంతర్యం.

అయితే ఆయన ఒకటి అనుకుంటే జనాలు మరో రకంగా అర్థం చేసుకున్నారు. అలా చేసుకునేలా పరిస్థితులు మారాయి అంతే తేడా. వాస్తవానికి గతంలో సల్మాన్ ఖాన్ ఇలాంటి పోస్టింగ్ పెడితే ఎగబడి లైక్ చేసేవారు, రీట్వీట్లు పెట్టేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు, సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అనేలా సుశాంత్ సింగ్ వ్యవహారం మలుపు తీసుకుంది. దీంతో సల్మాన్ పోస్టింగ్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

'మడ్ బాత్ చేసింది చాలు, ఇకవెళ్లి స్నానం చేయండి' అంటూ ఒకరు వెటకారంగా రిప్లై ఇస్తే.. 'నీ చేతులకి మట్టి అంటకుండా.. ఒళ్లంతా ఎలా బురద పూసుకున్నారో కాస్త మాకూ సెలవివ్వండి' అంటూ ఇంకొకరు లాజిక్ మాట్లాడారు. ఇంకొందరు సల్మాన్ ఖాన్ పాత కేసుల చిట్టా ఒకటి పోస్ట్ చేశారు. 'పేదలకు సాయం చేయాలంటే.. సోనూ సూద్ ని ఫాలో అవ్వండి, ఫొటోలకు ఫోజులివ్వాలంటే సల్మాన్ ని ఫాలో కండి' అంటూ ఇంకొకరు సెటైర్ వేశారు.

మొత్తమ్మీద కొన్ని గంటల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారడం, 80శాతం నెగెటివ్ కామెంట్లే రావడంతో ట్విట్టర్ లో సల్మాన్ పరువుపోయింది. రైతులపై సల్లూభాయ్ కి ఉన్న గౌరవం సంగతి దేవుడెరుగు.. సల్మాన్ గౌరవం మొత్తం మడ్ బాత్ లో కొట్టుకుపోయినట్టయింది. సుశాంత్ సింగ్ మరణంతో సల్మాన్ పై ఎంత వ్యతిరేకత ఏర్పడిందనే విషయం ఈ పోస్టుతో జనాలకు క్లియర్ గా అర్థమైంది.

విశాఖ ఫార్మాసిటీ లో భారీ అగ్నిప్రమాదం

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?