cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనా దెబ్బ.. ఆగిన సల్మాన్ సినిమా

కరోనా దెబ్బ.. ఆగిన సల్మాన్ సినిమా

కరోనా ఎఫెక్ట్ సల్మాన్ సినిమాపై కూడా పడింది. సల్మాన్ వ్యక్తిగత కారు డ్రైవరుతో పాటు పర్సనల్ స్టాఫ్ లో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో సల్మాన్ రెండు వారాల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. ఈమధ్యే రాధే సినిమా స్టార్ట్ చేశాడు సల్మాన్. ఇప్పుడా సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా, దిశా పటానీ హీరోయిన్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో ఊహించని విధంగా సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడ్డంతో, కండల వీరుడు తన కుటుంబంతో పాటు స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు.

మరోవైపు కరోనా బారిన తన స్టాఫ్ సభ్యుల్ని స్వయంగా తన సొంత ఖర్చుతో హాస్పిటల్ లో జాయిన్ చేశాడు సల్మాన్. అంతేకాదు.. ఇతర సభ్యులందరికీ మరోసారి పరీక్షలు చేయించాడు.

లాక్ డౌన్ టైమ్ లో జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు పెట్టుకోవాలని సందేశాలిచ్చాడు సల్మాన్. అంతా నార్మల్ పొజిషన్ కు వస్తున్న టైమ్ లో సల్మాన్ ఇలా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపింది అతడి టీమ్. 

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ...ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం

 


×