Advertisement

Advertisement


Home > Movies - Movie News

భ‌ర్త లుంగీ లుక్ ను రిలీజ్ చేసిన స‌మంత‌!

భ‌ర్త లుంగీ లుక్ ను రిలీజ్ చేసిన స‌మంత‌!

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న ల‌వ్ స్టోరీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది ఆ హీరో భార్య స‌మంత‌. నాగ చైత‌న్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె ఈ పోస్టర్ విడుద‌ల చేసింది. భ‌ర్త‌కు పుట్టిన శుభాకాంక్ష‌ల‌ను చెబుతూ ఈ పోస్ట్ పెట్టింది స‌మంత‌.

ల‌వ్ స్టోరీ సినిమాలో నాగ‌చైత‌న్య సాధార‌ణ యువ‌కుడిగా క‌నిపిస్తున్నాడ‌నే విష‌యాన్ని చెబుతోంది ఈ లుంగీ- బ‌నియ‌న్ లుక్. ఈ పాటికే విడుద‌ల కావాల్సిన ఈ సినిమాకు క‌రోనా దెబ్బ ప‌డింది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కాబోతోంద‌ని స‌మాచారం. 

ఈ సినిమాలో నాగ‌చైత‌న్య ప‌క్కా తెలంగాణ కుర్రాడిగా క‌నిపిస్తున్నాడ‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. తెలంగాణ స్లాంగ్ లోనే నాగ‌చైత‌న్య పాత్ర మాట్లాడుతుంద‌ని.. అందుకు సంబంధించి త‌న సినిమా హీరో చాలా క‌స‌ర‌త్తు చేశాడ‌ని శేఖ‌ర్ క‌మ్ములు చెప్పుకొచ్చారు. 

నాగ చైత‌న్య త‌దుప‌రి సినిమా విక్ర‌మ్ కుమార్ తో ఉండ‌బోతోంది. థ్యాంక్యూ పేరుతో రూపొందుతున్న ఆ సినిమాను ఈ ఏడాది ఆగ‌స్టులో నాగార్జున పుట్టిన రోజు అప్పుడే ప్ర‌క‌టించారు.

రోజూ పొద్దున్నే బంగారం తింటున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?