cloudfront

Advertisement


Home > Movies - Movie News

సమంతా.. అలా చెయ్యొద్దు ప్లీజ్‌.!

సమంతా.. అలా చెయ్యొద్దు ప్లీజ్‌.!

'బ్రాండ్‌ అంబాసిడర్‌'గా వ్యవహరించడమంటే మామూలు విషయం కాదు. బోల్డంత సొమ్ముతోపాటుగా, బోల్డన్ని వివాదాలు కూడా.! ఫలానా ప్రోడక్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా పాపులారిటీ పెరగడం మాటేమోగానీ, వివాదాలు ఎదురైతే, అందులోంచి బయటకు రావడం కూడా ఒక్కోసారి కష్టమవుతుంది. ఈ మధ్య సెలబ్రిటీలకు న్యాయస్థానాలు ఈ విషయమై ఝలక్‌ ఇచ్చిన సందర్భాల గురించి గట్టిగానే వింటున్నాం.

ఇక, అసలు విషయానికొస్తే.. 'కుర్‌కురే' ప్రోడక్ట్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సమంత. ఇరవయ్యేళ్ళ కుర్‌కురే ప్రస్తానం గురించి చెబుతూ, సోషల్‌ మీడియాలో సమంత ఇలా ట్వీటేసిందో లేదో అలా నెటిజన్లు ఆమెకు ఝలక్‌ ఇవ్వడం షురూ చేశారు. 'దయచేసి మీ ఇమేజ్‌ పాడు చేసుకోవద్దు.. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ప్రోడక్ట్స్‌ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి..' అంటూ సమంతకి కొందరు కాస్త సుతిమెత్తగా క్లాస్‌ తీసుకుంటున్నారు. మరికొందరేమో, 'డబ్బుల కోసం మరీ ఇంత బరితెగింపు ఏంటి.?' అంటూ పరుష పదజాలాన్నే ఉపయోగిస్తున్నారు.

కుర్‌కురే విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది. అందులో ప్లాస్టిక్‌ కంటెంట్‌ ఎక్కువగా వుంటోందనీ, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయనీ వైద్యులు హెచ్చరిస్తున్నా, చిన్న పిల్లలకే కాదు పెద్దలకీ ఇదో పాపులర్‌ 'స్నాక్‌ అండ్‌ టైమ్‌ పాస్‌' తిండి ఐటమ్‌గా పాపులర్‌ అయిపోయింది. మరి, అభిమానుల సలహాల్ని, సూచనల్ని, హెచ్చరికల్ని, బెదిరింపుల్ని సమంత పరిగణనలోకి తీసుకుంటుందా.? డబ్బే తనకి ముఖ్యమనుకుంటుందా.?

అన్నట్టు, గతంలో 'మ్యాగీ' ప్రోడక్ట్స్‌పై పెద్దయెత్తున ఆరోపణలు వస్తే, సెలబ్రిటీలు ఆ ప్రోడక్ట్‌ తరఫున ప్రచారం చేసేందుకు నిరాకరించారు. కూల్‌ డ్రింక్స్‌ విషయంలోనూ కొందరు సెలబ్రిటీలు వెనుకడుగు వేసిన సందర్భాలున్నాయి.. వివాదాలు చల్లారాక మళ్ళీ ప్రమోషన్ల కోసం పరుగులు పెట్టిన సెలబ్రిటీలూ వున్నారనుకోండి.. అది వేరే విషయం.

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..