Advertisement


Home > Movies - Movie News
ప్రత్యూష కోసం సమంత మరోసారి..!

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యూష ఫౌండేషన్ ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది సమంత. దీనికి నిధుల కోసం ఇప్పటికే 2సార్లు వేలంపాట కూడా నిర్వహించింది. పవన్, మహేష్ లాంటి స్టార్స్ వేసుకున్న దుస్తులు, యాక్ససిరీస్ ను వేలంపాటలో అమ్మి, ఆ డబ్బుతో ఎంతోమందిని ఆదుకుంది.

ఇప్పుడు మరోసారి వేలంపాటకు రెడీ అవుతోంది సమంత. ఈసారి దుస్తులు, యాక్ససిరీస్ కాకుండా.. తన పెళ్లికి వచ్చిన బహుమతుల్ని వేలం వేయాలని నిర్ణయించుకుంది. అలా ఫౌండేషన్ కు నిధులు సమకూర్చాలని ఫిక్స్ అయింది.

సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత పలు రిసెప్షన్లలో పాల్గొన్నారు. ఈ అన్ని వేడుకల్లో ఈ జంటకు చాలానే బహుమతులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని వేలం వేయాలని సమంత అనుకుంటోంది.

ఈ మేరకు భర్త నాగచైతన్య, మామ నాగార్జున అనుమతి కూడా తీసుకుంది. త్వరలోనే ఈ వేలంపాట తేదీతో పాటు, వేలంలో అమ్మకానికి పెట్టనున్న వస్తువుల వివరాలను వెల్లడించనుంది సమంత.