cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

హాలీవుడ్ సినిమాలో సమంత

హాలీవుడ్ సినిమాలో సమంత

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది సమంత. ఇందులో భాగంగా ఇప్పటికే 2 సినిమాలు ఓకే చేసింది. పుష్ప సినిమాలో బన్నీ సరసన ఐటెంసాంగ్ కూడా చేయబోతోంది. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్టు ప్రకటించింది ఈ బ్యూటీ.

ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ ఫిలిం చేయబోతోంది సమంత. ఈ సినిమా పేరు ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్. ఇదే పేరుతో భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. ఈ సినిమాలో బై-సెక్యువల్ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోంది. అంటే, కేవలం పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర అన్నమాట.

ఫ్యామిలీ మేన్ సీజన్-2లో ఆమె పోషించిన రెబల్ తమిళ యువతి పాత్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన వివాదాస్పద పాత్రను పోషిస్తోంది సమంత. పైగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారు. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఛాలెంజింగ్ రోల్ తో నటిగా తననుతాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటోంది సమంత.

డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఓ ద్విభాషా చిత్రం చేయబోతోంది సమంత. అదే టైమ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మరో సినిమాకు అంగీకరించింది. ఇప్పుడీ ఇంటర్నేషనల్ సినిమాతో కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లబోతోంది. ఇక పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ ను రేపట్నుంచి స్టార్ట్ చేయబోతోంది ఈ బ్యూటీ. 

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!