Advertisement

Advertisement


Home > Movies - Movie News

స‌మంత 'సెక్స్' ఆన్స‌ర్.. ఇప్పుడు వైర‌ల్!

స‌మంత 'సెక్స్' ఆన్స‌ర్.. ఇప్పుడు వైర‌ల్!

ఇది చాలా పాత క‌థ‌. నాగ‌చైత‌న్య‌తో స‌మంత పెళ్లికి ముందు ఒక మ్యాగ‌జైన్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంట‌ర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ కొశ్చ‌న్స్ అనో ఆన్స‌ర్ అనో ఒక శీర్షిక పెట్టి.. స‌మంత‌ను కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఆ ప్ర‌శ్న‌లు కాస్త బోల్డ్ ఉంటాయి. ఆ ప్ర‌శ్న‌లే  కాదు.. వాటికి స‌మంత చెప్పిన స‌మాధానాలు కూడా బోల్డ్ గా ఉంటాయి. అవి అప్ప‌ట్లోనే హాట్ టాపిక్ అయ్యాయి.

ఫుడ్ లేదా సెక్స్.. వీటిల్లో దేనికి నీ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త అనే ప్ర‌శ్న‌కు స‌మంత స‌మాధానం ఇస్తూ.. త‌ను ఫుడ్ లేకుండా ఒక రోజు ఉండ‌గ‌ల‌నంటూ కాస్త స‌ర‌దాగా ఆన్స‌ర్ ఇచ్చింది. త‌ద్వారా సెక్సే త‌న ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త అని చెప్పింది. అప్ప‌టికి స‌మంత‌కు పెళ్లి కాలేదు. 

పెళ్లి కాని యువ‌తి ఆ త‌ర‌హా స‌మాధానం చెప్ప‌డంతో కొంత‌మంది బుగ్గ‌లు నొక్కుకున్నారు. అస‌లు పెళ్లికీ, సెక్స్ కూ సంబంధం లేద‌నుకునే వాళ్లకు అందులో త‌ప్పేం అనిపించ‌లేదు!

మ‌రి దాదాపు ఐదేళ్ల కింద‌టి ఆ వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. వ‌చ్చింద‌న‌డం క‌న్నా.. ఇలాంటి విష‌యాల డిష్క‌ష‌న్ కు ఇష్ట‌ప‌డే వాళ్లు దాన్ని మ‌ళ్లీ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. స‌మంత అప్ప‌ట్లో ఈ మాట అంది క‌దా.. అని గుర్తు చేయ‌డంలో వీరి ఉద్దేశం వెకిలిదే! 

విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌కు త‌ను ఫుడ్ క‌న్నా ఎక్కువ‌గా కోరుకునేది ఎలా ల‌భిస్తుంద‌బ్బా! త‌ర‌హా లాజిక్కుల‌తో త‌మ చెత్త మైండ్ సెట్ ను నిస్సిగ్గుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు!

అదే పెళ్లై, విడాకులు తీసుకున్న ఏ సినిమా హీరోనో ఈ విష‌యంలో ఎవ‌రూ అడ‌గ‌లేరు! సెక్స్ విష‌యంలో మీరేం చేస్తున్నారు అని! అదే స్త్రీ అంటే.. అది కూడా బోల్డ్ గా స్పందిస్తే.. అంద‌రికీ లోకువే! అందుకే ఇలాంటివి షేర్ చేసి కొంద‌రు త‌మ మాన‌సిక రోగానికి మందేసుకుంటున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?