cloudfront

Advertisement


Home > Movies - Movie News

భార్యాభర్తల బాక్సాఫీస్ వార్.. సమంతదే పైచేయి

భార్యాభర్తల బాక్సాఫీస్ వార్.. సమంతదే పైచేయి

రెండు సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయి. ఒకటి పెద్ద బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్, భారీ అంచనాలతో వచ్చినా అంచనాల్ని అందుకోవడంలో ఫెయిలైంది. మరొకటేమో అంచనాలు తక్కువైనా ప్రశంసలు ఎక్కువ తెచ్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పోలికలు మామూలే. అయితే ఇక్కడ మాత్రం ఓ ఆసక్తికర పోటీ ఉంది. హిట్టైన సినిమాలో మెయిన్ లీడ్ భార్య అయితే, వెనకపడ్డ సినిమాలో హీరో భర్త. 

ఈ వినాయక చవితిపండగ భార్య సమంతలో ఫుల్ జోష్ నింపితే, భర్త నాగచైతన్యకు మాత్రం అసంతృప్తిని మిగిల్చింది. భార్య చేతిలో భర్త ఓటమిని అంగీకరించాల్సి వస్తోంది. ఇలాంటి పోలికలు ఉంటాయనే.. రెండు సినిమాల మధ్య గ్యాప్ మెయింటెన్ చేశారు నిర్మాతలు. అయితే అనుకోకుండా శైలజారెడ్డి అల్లుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చి సరిగ్గా యుటర్న్ మూవీ రిలీజ్ డేట్ కే ఫిక్స్ అయింది. 

సమంత మెయిన్ లీడ్ చేసిన రీమేక్ మూవీ యు టర్న్ తో పాటు వినాయక చవితి రోజే శైలజారెడ్డి అల్లుడు కూడా థియేటర్స్ లోకి వచ్చాడు. అల్లుడిగారి ప్రతాపానికి ప్రేక్షకుల స్పందన అంతంత మాత్రంగానే ఉంటే.. ఊహించని ట్విస్ట్ లతో, సమంత యాక్టింగ్ స్కిల్స్ తో యు టర్న్ మూవీ ఓ వర్గం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

సేఫ్ ఫార్ములా అంటూ నాగచైతన్య మూసలో పడి కొట్టుకుపోగా.. పెళ్లైన తర్వాత సినిమాల విషయంలో సెలక్టివ్ గా ఉంటున్న సమంతకి మాత్రం ఆశించిన కిక్ ఇచ్చింది యు టర్న్. మొత్తానికి భర్తతో బాక్సాఫీస్ పోటీలో తలపడి, అతడిపై విజయం సాధించిన తొలి భార్యగా ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది సమంత.