Advertisement

Advertisement


Home > Movies - Movie News

లాక్ డౌన్ సీజన్ లో మరో హీరోయిన్ పెళ్లి

లాక్ డౌన్ సీజన్ లో మరో హీరోయిన్ పెళ్లి

ఈ కరోనా టైమ్ లో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. రానా, కాజల్, నిఖిల్, నితిన్.. ఇలా చాలామంది ఓ ఇంటివాళ్లయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ సనా ఖాన్ కూడా చేరిపోయింది. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షోలో నటించిన ఈ బ్యూటీ.. నిన్న పెళ్లి చేసుకుంది.

గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్ ను సనా ఖాన్ పెళ్లాడింది. చాలా సింపుల్ గా వీళ్ల పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో రాత్రి నుంచి వైరల్ అవుతోంది. ఆ కేక్ పై ''నిఖా ముబారక్'' అని రాసి ఉంది.

మోడల్, డాన్సర్ గా పేరు తెచ్చుకున్న సనాఖాన్, 2005లో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరైంది. మోడల్ గా 50కి పైగా యాడ్స్ చేసిన ఈ బ్యూటీ.. 15 సినిమాలు చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో ఈమె నటించింది. తెలుగులో కల్యాణ్ రామ్ కత్తి, మిస్టర్ నూకయ్య లాంటి సినిమాలు చేసింది.

తను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు గత నెలలో ప్రకటించింది సనాఖాన్. ఆమె పెళ్లి చేసుకోబోతోందని అప్పుడే పుకార్లు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ, నిన్న సూరత్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది సనా.

బుద్ది లేని రాతలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?