cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఆ హీరోతో డేట్.. రణ్ బీర్ తో పెళ్లి!

ఆ హీరోతో డేట్.. రణ్ బీర్ తో పెళ్లి!

ఏం మాయ చేస్తున్నాడో కానీ.. బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్న కుర్రభామల వరకూ అందరినీ పడేస్తున్నాడు రణ్ బీర్ కపూర్. ఇప్పటికే ఈ హీరో గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దగా ఉంది. వాటిల్లో ప్రముఖమైన ఎఫైర్లు దీపికా పదుకునే, కత్రినా కైఫ్ లతో నెరిపినవి. ఈ మధ్యనే ఈ హీరో అలియా భట్ తో ప్రేమాయణాన్ని మొదలుపెట్టాడు.

ఒకదశలో కత్రినాను రణ్ బీర్ పెళ్లి చేసేసుకుంటున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. అదేం జరగలేదు. బ్రేకప్ అన్నారు. ఇప్పుడు రణ్ బీర్, అలియా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ ప్రేమాయణం సంగతలా ఉంటే.. తను రణ్ బీర్ కు పడిపోయానని అంటోంది సారా అలీఖాన్.

అవకాశం వస్తే రణ్ బీర్ ను పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మడు గర్వంగా చెప్పుకుంటోంది. ప్రస్తుత బాలీవుడ్ హీరోల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. అని అంటే, ఛాన్స్ వస్తే రణ్ బీర్ ను అని చెబుతోంది. అయితే తనకు మరో నటుడితో డేటింగ్ చేయాలని ఉందని ఈమె చెప్పింది. అతడేమంత స్టార్ కాదు.. ఛాన్స్ వస్తే కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తానని ఈ యంగ్ హీరోయిన్ చెప్పింది.

త్వరలోనే ఈమె తొలి సినిమా 'సింబా' విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తను ఏ నటులపై మనసు పారేసుకున్నదీ వివరించి చెప్పింది సారా.

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్