మహేష్ బాబు-పరుశురామ్ కాంబినేషన్ లో తయారవుతున్న సంక్రాంతి సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ప్రీ పబ్లిసిటీ మొదలైంది.
ఈ సినిమాలో మహేష్ లుక్ తో పోస్టర్ ను విడుదల చేసారు. ఎర్రటి కార్ డోర్ తెరచి కిందకు దిగబోయే లుక్ లో మహేష్ కనిపించాడు.
కొత్త హైర్ స్టయిల్, కొత్త లుక్ తో అట్రాక్టివ్ గా కనిపించాడు మహేష్. ఓ కీలకమైన ఫైటింగ్ సీన్ లో పిక్ లా వుంది ఈ స్టిల్. ఎందుకంటే కారు డ్యామేజ్ అయినట్లు కనిపిస్తోంది. కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది.
ఇటు స్టయిల్, అటు యాక్షన్ రెండూ సమపాళ్లలో వుంటాయని ఒక్క పిక్ తో చెప్పే ప్రయత్నం చేసినట్లుంది డైరక్టర్ పరుశురామ్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు 14 రీల్స్ ప్లస్, ఇంకా మైత్రీ మూవీస్ నిర్మాతలు.