cloudfront

Advertisement


Home > Movies - Movie News

ప్రియాంక డ్రెస్ లపై ఆగని సెటైర్లు!

ప్రియాంక డ్రెస్ లపై ఆగని సెటైర్లు!

అది స్విమ్ సూటా? లేకపోతే డిజైనర్ డ్రస్సా.. ఇంకా అర్థంకావడం లేదు.. అని అంటున్నారు నెటిజన్లు. ఇటీవల ఇన్ స్టాగ్రమ్ లో ప్రియాంక కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అవన్నీ ట్రోల్ కు గురి అవుతూ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి. కొన్నిరోజుల కిందట ప్రియాంక ఈ పిక్ ను పోస్టుచేసింది. ఇప్పటికీ అది ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంది. స్విమ్ సూట్ కన్నా కాస్త పైకే వేసింది ఈ డ్రస్. దానికి కాస్త వేరే లుక్ ఇచ్చినా.. అది సెటైర్ల పాలు అవుతోంది.

ఈ డ్రస్ మాత్రమేకాదు, ప్రియాంక చీర కట్టినా అందాలన్నీ ప్రదర్శించేలా కడుతూ ఉంది. అది కూడా ఎబ్బెట్టుగా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. జాకెట్ లేకుండా చీర కట్టడం, బ్రాసరీ మీద చీర కట్టడం... ఈ తరహా ఫ్యాషన్ తో ప్రియాంక కొంతమందిని ఎంటర్ టైన్ చేస్తోంది కానీ, మరి కొంతమందిని మాత్రం విసిగిస్తోంది. 'ఏంటిది?' అంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.

అందాలను చూపించి, చూపించకుండా ఉన్నట్టు ఉంటేనే ఏ హీరోయిన్ కు అయినా అదో అందం.. మరీ వెగటు పుట్టిస్తే మాత్రం సదరు నటీమణి మీద కూడా ఆసక్తి పోతుందని ప్రియాంక శ్రేయోభిలాషులు కూడా చెబుతూ ఉన్నారు. అందులోనూ ప్రియాంక మరీ కుర్ర భామ కూడా ఏమీ కాదు.

ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు స్కూల్ పిల్లలుగా ఉన్న వాళ్ల వయసు ఇప్పుడు ముప్పై దాటేసింది. కాబట్టి.. ప్రియాంక తన వయసు గురించి కూడా కాస్త ఆలోచించుకోవాలేమో!

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం