cloudfront

Advertisement


Home > Movies - Movie News

సత్యాగ్రాహి అందుకే ఆపేశాను - పవన్ కల్యాణ్

సత్యాగ్రాహి అందుకే ఆపేశాను - పవన్ కల్యాణ్

పవన్ కెరీర్ లోనే అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన సినిమా సత్యాగ్రాహి. అసలు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది సెట్స్ పైకి రావడానికి ఎందుకు జాప్యం అవుతోంది? ఇంతకీ సత్యాగ్రాహిలో పవన్ ఏం చెప్పాలనుకున్నాడు? అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఊహాగానాలు. వాటన్నింటికీ సమాధానాలు ఇవ్వకపోయినా, క్లుప్తంగా సత్యాగ్రాహి సినిమాపై స్పందించాడు పవన్.

"సత్యాగ్రాహి సినిమాను నేను కావాలనే ఆపేశాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ సినిమాను నేను స్టార్ట్ చేసి ఆపేశాను. దీనికి కారణం ఒకటే. అందులో హీరో తెగ పోరాటాలు చేస్తాడు. అలా తెరపై పోరాటాలు చేయడం నాకిష్టం లేదు. నిజజీవితంలో పోరాటం చేసేందుకే ఆ సినిమాను ఆపేశాను."

నిజానికి అజ్ఞాతవాసి స్థానంలో సత్యాగ్రాహి సినిమా రావాలి. ఈ మేరకు అజ్ఞాతవాసి సెట్స్ పైకి రాకముందు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ సత్యాగ్రాహి ఆగిపోయింది. అజ్ఞాతవాసితో పవన్ కెరీరే ఆగిపోయింది. అయితే సత్యాగ్రాహి ఆగిపోవడంపై తనకు ఎలాంటి బాధ లేదంటున్నాడు పవన్. నిజానికి అది ఆగిపోవడం వల్లనే తను ప్రజల మధ్యలోకి రాగలిగానంటున్నాడు. 

"సత్యాగ్రాహి సినిమా ఆపేసినప్పుడు చాలామంది నన్ను తిట్టారు. ఆ సినిమా పోస్టర్ లో జయప్రకాష్ నారాయణ్, చెగువేరా లాంటి వ్యక్తుల ఫొటోలు కూడా పెట్టాను. కానీ సినిమాల్లో పోరాటం చేయడం నాకు నచ్చలేదు. సినిమాల్లో పోరాటాలు చేస్తే పనులు జరగడం లేదు."

తన యూఎస్ పర్యటనలో భాగంగా డల్లాస్ లో నిర్వహించిన ప్రవాసాంధ్ర గర్జన అనే కార్యక్రమంలో పవన్ ఈ వివరాలు వెల్లడించాడు. జనసేన పార్టీకి నిధులు సేకరించే ఉద్దేశంతో తను అమెరికాకు రాలేదని, డబ్బులే కావాలనుకుంటే ఇంత దూరం రానక్కర్లేదని తెలిపాడు పవన్.