సెకెండ్ ఇన్నింగ్స్ లో యాక్షన్ అవతార్

కరోనా టైమ్ లో గ్యాప్ తీసుకున్న కాజల్, అదే టైమ్ లో పెళ్లి చేసుకుంది, బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఆ తర్వాత కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైన ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే సెకెండ్…

కరోనా టైమ్ లో గ్యాప్ తీసుకున్న కాజల్, అదే టైమ్ లో పెళ్లి చేసుకుంది, బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఆ తర్వాత కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైన ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. తెలుగులో బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది.

తాజాగా మరో సినిమా అంగీకరించింది కాజల్. ఈ మూవీకి సత్యభామ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కెరీర్ లో కాజల్ కు ఇది 60వ చిత్రం అంట. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది.

కెరీర్ లో తొలిసారి యాక్షన్ మోడ్ లో కనిపించింది కాజల్. ఏసీపీ సత్యభామగా పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టిన ఆమె, దొంగతో నిజం చెప్పించే సన్నివేశాన్ని టైటిల్ గ్లింప్స్ కింద విడుదల చేశారు.

రెగ్యులర్ పోలీస్ పాత్రలకు భిన్నంగా, ఇందులో కాజల్ ను చీరకట్టులో, చేతికి గాజులతో చూపించారు. ఈ ఎలిమెంట్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. గ్లింప్స్ చివర్లో కాజల్ చెప్పిన డైలాగ్ కూడా బాగుంది.

అఖిల్ డేగల డైరక్ట్ చేయబోయే ఈ సినిమాకు మరో దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే సమకూర్చాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.