ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు సత్యదేవ్. తాజాగా రిలీజైన తిమ్మరుసు, థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ సత్యదేవ్ మార్కెట్ పై ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. తాజాగా సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కింద మంచి బిజినెస్ చేసింది.
ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఏకంగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. మ్యాంగో రామ్ ఈ మేరకు హక్కులు దక్కించుకున్నారు. దాని మీద ఇంకొంత పర్సంటేజీ వేసుకొని, ఏదైనా ఛానెల్ కు ఆయన అమ్ముకుంటారన్నమాట. ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటించింది. సినిమాకు ఈ రేటు రావడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు.
గుర్తుందా శీతాకాలం అనేది ఓ రీమేక్ సినిమా. కన్నడలో ఈ సినిమా పెద్ద హిట్టయింది. దానికి చిన్నచిన్న మార్పులు చేసి తెలుగు వెర్షన్ ను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. మంచి డేట్ చూసి రిలీజ్ చేయడమే ఆలస్యం.
ఈ సినిమాతో పాటు సత్యదేవ్ చేతిలో గాడ్సే, స్కై ల్యాబ్ అనే సినిమాలున్నాయి. ఈ రెండు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.