cloudfront

Advertisement


Home > Movies - Movie News

సాయేషాను పెళ్లాడిన ఆర్య

సాయేషాను పెళ్లాడిన ఆర్య

శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు ఘనంగా జరిగిన వివాహ వేడుకతో ఆర్య-సాయేషా పెళ్లి తంతు పూర్తయింది. ఇప్పుడు వీళ్లిద్దరూ భార్యాభర్తలు. హైదరాబాద్ లో నిన్న రాత్రి ఆర్య, సాయేషా ఒక్కటయ్యారు. సంప్రదాయ ముస్లిం పద్ధతిలో వీళ్ల వివాహం జరిగింది. 

సాయేషా బంధువుల్లో ఎక్కువమంది హైదరాబాద్ లోనే ఉన్నారు. అటు హైదరాబాద్ లో పెళ్లికి ఆర్య తరఫు బంధువులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అందుకే హైదరాబాద్ ను వేదికగా ఎంచుకుంది ఈ జంట. త్వరలోనే చెన్నైలో ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటుచేయబోతున్నారు. 

గజనీకాంత్ అనే సినిమాతో ఆర్య, సాయేషా కలిశారు. భలే భలే మగాడివోయ్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమా టైమ్ లో ఒకరికొకరు పరిచయం అవ్వడం, ఆ వెంటనే ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగిపోయాయి. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ కోలీవుడ్ మీడియాలో ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తమ లవ్ మేటర్ తో పాటు పెళ్లి కబురును కూడా బయటపెట్టింది ఈ జంట. ఇప్పుడిలా పెళ్లితో ఒకటైంది. 

21 ఏళ్ల సాయేషా తెలుగులో అఖిల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. పెళ్లి తర్వాత కేవలం ఒకే ఒక్క సినిమాలో ఆమె నటించబోతోంది. ఆ తర్వాత ఇక సినిమాలు చేయదట. 38 ఏళ్ల ఆర్య కోలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..