Advertisement


Home > Movies - Movie News
బంపర్ ఆఫర్ కొట్టేసిన అఖిల్ హీరోయిన్

అఖిల్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయేషా.. ఆ మూవీ తర్వాత తెలుగులో కనిపించడం మానేసింది. తమిళనాట సినిమాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే అక్కడ కూడా ఆమెకు క్రేజ్ తీసుకొచ్చే సినిమాలు తగల్లేదు. ఎట్టకేలకు సాయేషాకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా సూర్య సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది.

కేవీ ఆనంద్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో బ్రదర్స్ అనే డిఫరెంట్ సినిమా వచ్చింది. అందులో అవిభక్త కవలలుగా, డ్యూయల్ రోల్ చేశాడు సూర్య. ఇప్పుడు కూడా కేవీ ఆనంద్ డైరక్షన్ లో అలాంటిదే మరో ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమాలో సాయేషాను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇదే సినిమాలో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. మోహన్ లాల్ కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే అదృష్టమే. కాకపోతే.. సాయేషాకు ఇందులో మెయిన్ హీరోయిన్ రోల్ దక్కిందా.. లేక సెకెండ్ హీరోయిన్ స్థానానికే పరిమితమైపోతుందా అనేది తేలాల్సి ఉంది.

సూర్య సరసన మెయిన్ హీరోయిన్ అయితే మాత్రం సాయేషా జాక్ పాట్ కొట్టినట్టే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సూర్య తమ్ముడు కార్తితో ఓ సినిమా చేస్తోంది.