cloudfront

Advertisement


Home > Movies - Movie News

నర్తనశాల సింబల్ వెనక సీక్రెట్ చెప్పిన హీరో

నర్తనశాల సింబల్ వెనక సీక్రెట్ చెప్పిన హీరో

నాగశౌర్య హీరోగా నర్తనశాల సినిమా వస్తోంది. కానీ ఈ టైటిల్ కు ముందు ఎట్ (@) అనే సింబల్ తగిలించారు. డైరక్ట్ గా నర్తనశాల అనే పేరు పెడితే సరిపోయేది. కానీ ముందు ఆ సింబల్ ఎందుకు తగిలించారనే అనుమానం చాలామందిలో ఉంది. ఎట్టకేలకు ఆ డౌట్ పై క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య.

"నర్తనశాల అనే సినిమాను చాలామంది స్టార్ట్ చేశారు. ఎందుకో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టులు వర్కవుట్ కాలేదు. అలాంటి టైటిల్ అనుకున్నప్పుడు, మా ప్రాజెక్టు కూడా ఆగిపోతుందేమో అని భయపడ్డాం. బ్యాడ్ సెంటిమెంట్ ఉంది, కాస్త టైటిల్ మారిస్తే బెటరని చాలామంది సలహా ఇచ్చారు. అలా అని పూర్తిగా నర్తనశాల టైటిల్ ను తీసి పక్కనపెట్టే పరిస్థితి లేదు. అందుకే ఎట్ (@) అనే సింబల్ ను తగిలించాం."

ఇలా సింబల్ పై క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య. నిజానికి ఈ హీరో చెప్పిన లాజిక్ లో అర్థముంది. ఎందుకో ఈ టైటిల్ చాలామందికి అచ్చిరాలేదు. అలనాటి నర్తనశాల సూపర్ హిట్ అయిన తర్వాత బృహన్నల పాత్ర చుట్టూ అల్లుకున్న కథతో ఓ సినిమా చేద్దామని పెద్ద ఎన్టీఆర్ భావించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.

తండ్రి కోరికను నెరవేరుద్దామనే ఉద్దేశంతో బాలకృష్ణ కూడా నర్తనశాల టైటిల్ తో సినిమా స్టార్ట్ చేశారు. ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ హీరోయిన్ సౌందర్య హఠాన్మరణంతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఇక నర్తనశాల ప్రాజెక్టును టచ్ చేయనని ఒక దశలో బాలకృష్ణ చెప్పేశాడు కూడా.

అలాంటి టైటిల్ తో సినిమా చేస్తున్నప్పుడు నెగెటివ్ సెంటిమెంట్ పడకూడదనే ఉద్దేశంతో టైటిల్ కు ముందు @ అనే సింబల్ ను తగిలించామని చెప్పుకొచ్చాడు నాగశౌర్య. నర్తనశాలలో బృహన్నల క్యారెక్టర్ ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా నాగశౌర్య గే పాత్రలో కనిపించాడు. అందుకే ఈ టైటిల్ పెట్టారు. రేపు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.