cloudfront

Advertisement


Home > Movies - Movie News

'చంద్రముఖి'కి ఇంకో సీక్వెల్ వస్తోంది!

'చంద్రముఖి'కి ఇంకో సీక్వెల్ వస్తోంది!

ఎప్పుడో 90లలో మలయాళీలు రూపొందించిన 'మణి చిత్రతాళు' సినిమా దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడో ఒకచోట రీమేక్ అవుతూనే ఉంది. మలయాళీ వెర్షన్ వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత ఆ సినిమా కన్నడలో రీమేక్ అయ్యింది.    'ఆప్తమిత్ర' పేరుతో సంచలన విజయం సాధించింది.

విష్ణువర్ధన్, సౌందర్యలు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించే సరికి రజనీకాంత్ దానిపై దృష్టి నిలిపాడు. ఆ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేశాడు. ఆ భాషల్లో కూడా ఆ సినిమా అంతే సంచలన విజయం సాధించింది. రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంది. దాదాపు 14 సంవత్సరాల కిందటే నలభై కోట్ల రూపాయల పైస్థాయి వసూళ్లతో 'చంద్రముఖి' సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత కన్నడీగులు ఆ సినిమాకు ఒక సీక్వెల్ చేశారు. కేవలం అందులోని ప్రధాన పాత్రను లీడ్ చేస్తూ కన్నడలో 'ఆప్తరక్షక' సినిమా తీశారు. విష్ణువర్ధన్ హీరోగానే నటించిన ఆఖరి సినిమా. అది అక్కడ సెన్షేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమానే రజనీకాంత్ హీరోగా రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. చివరకు 'నాగవల్లి-చంద్రముఖి-2'గా వెంకటేష్ హీరోగా ఆ సినిమా తెలుగులో రూపొందింది. ప్లాప్ అయ్యింది.

అయినా చంద్రముఖి సబ్జెక్టుపై సినిమా వాళ్లకు ఇష్టం పోయినట్టుగా లేదు. ఈసారి హిందీలో సీక్వెల్ వస్తోందట. కన్నడ, తెలుగు,తమిళాల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాకా.. హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 'భూల్ భులయ్యా' పేరుతో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రీమేక్ అయ్యింది. అక్కడ యావరేజ్ హిట్టే అయ్యింది ఆ సినిమా.

కానీ ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నారట. అందుకు అక్షయ్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇతర ప్రాజెక్టులు అన్నీ ఒక కొలిక్కి రాగానే ఈ ఏడాదిలోనే 'భూల్ భులయ్యా-2' షూటింగ్ మొదలుకానున్నదని బాలీవుడ్ పత్రికలు పేర్కొంటున్నాయి.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!