cloudfront

Advertisement


Home > Movies - Movie News

బాలీవుడ్ అర్జున్ రెడ్డి.. భార్యతో స్వీట్ కిస్!

బాలీవుడ్ అర్జున్ రెడ్డి.. భార్యతో స్వీట్ కిస్!

దీపావళి శుభాకాంక్షలను తమ ఫాలోయర్లకు తెలుపుతూ.. తమ అదర చుంభనాన్ని షేర్ చేశారు.. బాలీవుడ్ స్వీట్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్. బాలీవుడ్ లో క్రేజీ జంట వీరిది. షాహిద్ భార్యకు బాలీవుడ్ హీరోయిన్ల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. ఆమెను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకులే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

అంత అందమైన భార్యను తెచ్చుకున్నాడు షాహిద్. మీరాతో పెళ్లికి ముందు వేరే హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలను నడిపిన అనుభవం ఉన్న షాహిద్ కు ఆ హీరోయిన్ల కన్నా అందమైన భార్య లభించింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా.

ఈ క్రేజ్ కపుల్ ఒక స్వీట్ కిస్ ను సోషల్ మీడియాలోకి షేర్ చేశారు. దీపావళి శుభాకాంక్షలను తెలపడానికి తమ పీడీఏ మొమెంట్ ను షేర్ చేశారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ పనిలో ఉన్నాడు షాహిద్. ఇలాంటి నేపథ్యంలో ఇతడు భార్యతో అర్జున్ రెడ్డి మార్క్ కిస్ తో కనిపించడం విశేషం.

ఇక ఈ లవ్లీ కిస్ ను కొంతమంది సరదాగా తీసుకున్నారు. స్వీట్ అని అంటున్నారు. ఇంకొందరు యథాతథంగా నీతులు వల్లె వేస్తున్నారు. షాహిద్, మీరాలు ఇలాంటి ఫొటోను షేర్ చేయడం పై వీరు మండి పడుతున్నారు. సిగ్గులేని పని అని అంటూ విరుచుకుపడుతున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి!

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్