Advertisement

Advertisement


Home > Movies - Movie News

వరస ఫ్లాప్ లు.. హీరో ఫ్రస్ట్రేషన్..!

 వరస ఫ్లాప్ లు.. హీరో ఫ్రస్ట్రేషన్..!

వరస ఫ్లాఫులతో బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్. ఒకదాని తర్వాత మరోటి, ఒక దానికి మించి మరోటీ ఫ్లాప్ లే షారూక్ ను పలకరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన పరిస్థితిపై తనే జాలి ప్రకటించుకున్నారు షారూక్. ' ఇలా వరస ఫ్లాప్ లు వస్తే.. ఇక తనకు సినిమాల అవకాశాలు ఉండవేమో..' అని కొన్నళ్ల కిందట షారూక్ అన్నారు.

ఆ తర్వాత కూడా ఈ హీరోకి హిట్ కలిసి రాలేదు. 'జీరో' రూపంలో మరో ఫ్లాపే మిగిలింది. షారూక్ తన కెరీర్ లో ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో ఇలా వరస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడు.

ఇలాంటి క్రమంలో తన పరిస్థితిపై మరోసారి తనే జాలిని ప్రకటించుకున్నాడు షారూక్. 'మేం కథలను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడంలో విఫలం అవుతున్నాం..' అని షారూక్ వ్యాఖ్యానించాడు. తన ఫ్లాఫులపై ఈ ప్రకటన చేశాడు ఈ హీరో. 

ఇక షారూక్ తదుపరి సినిమా ఏదనేది కూడా ఇంకా మిస్టరీనే. తదుపరి సినిమా కోసం షారూక్ దర్శకుడి వేటలో ఉన్నాడు. అయితే ఒక సినిమాలో ప్రత్యేక పాత్రను మాత్రం చేయబోతున్నాడు. అనేక మంది స్టార్ ల కలయికతో రూపొందబోతున్న 'బ్రహ్మస్త్ర' లో షారూక్ ఒక ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?