cloudfront

Advertisement


Home > Movies - Movie News

శైలజారెడ్డికే ఎందుకిలా జరుగుతోంది?

శైలజారెడ్డికే ఎందుకిలా జరుగుతోంది?

ఏ ముహూర్తాన అనుకున్నారో కానీ శైలజారెడ్డి అల్లుడు సినిమాకు డేట్స్ విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. తాజాగా ఈరోజు తలపెట్టిన ట్రయిర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదావేశారు. హరికృష్ణ హఠాన్మరణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ట్రయిలర్ విడుదలకు సంబంధించి మరో తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు.  

శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి అడ్డంకులు రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. కేరళలో వరదల కారణంగా రీ-రికార్డింగ్ లేట్ అయింది. దీంతో ఏకంగా సినిమానే వచ్చేనెలకు వాయిదావేశారు. లేదంటే ఎల్లుండికి థియేటర్లలో ఉండాల్సిన సినిమా ఇది. 

ఇక ఆమధ్య సింగిల్ ను విడుదల చేయాలనుకుంటే, అదే టైమ్ లో మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూశారు. దీంతో ఆరోజు జరగాల్సిన కార్యక్రమం కూడా వాయిదాపడింది. ఇప్పుడు ట్రయిలర్ విషయంలో కూడా ఇలానే జరిగింది. 

హరికృష్ణ హఠాన్మరణంతో ఈరోజు టాలీవుడ్ దాదాపు స్తంభించిపోయింది. శైలజారెడ్డి అల్లుడు ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమంతో పాటు, పందెంకోడి-2 టీజర్ రిలీజ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. వీటితో పాటు నాగార్జున కూడా తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నాడు.

మరోవైపు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా విడుదల చేద్దామనుకున్న అఖిల్ సినిమా లుక్ ను కూడా ఆపేశారు.