Advertisement


Home > Movies - Movie News
ఆ నిర్మాత అట్నుంచి నరుక్కొస్తున్నాడు

స్ట్రయిట్ సినిమాలు చేసినప్పుడు సక్సెస్ అందుకోలేకపోయాడు శరత్ మరార్. డబ్బింగ్ మూవీస్ మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా కలిసిరావడం మొదలైంది. మొన్నటికిమొన్న అదిరింది సినిమాతో సక్సెస్ అందుకున్న శరత్ మరార్.. ఇప్పుడు కర్తవ్యం మూవీతో మరోసారి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. 

నయనతార లీడ్ రోల్ చేసిన మూవీ కర్తవ్యం. కంప్లీట్ సీరియస్ మూవీ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా తెరకెక్కిన సినిమా. ఇలాంటి సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయడం అంటే రిస్క్ చేయడమే. కానీ మరార్ లెక్క తప్పలేదు. కర్తవ్యం సినిమాకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. నిన్న రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

విజయ్ కు తెలుగులో అస్సలు మార్కెట్ లేదని తెలిసి కూడా అతడు నటించిన మెర్సెల్ సినిమాను అదిరింది పేరుతో విడుదల చేశాడు మరార్. ఆ సినిమాకు తొలి రోజే కోటి రూపాయల వసూళ్లు వచ్చాయి. వారం రోజుల్లో 9కోట్లు వచ్చాయి.

ఇప్పుడు కర్తవ్యం సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు. కాటమరాయుడు తర్వాత స్ట్రయిట్ సినిమాలు తగ్గించిన ఈ నిర్మాత.. డబ్బింగ్ సినిమాలతో బాగానే క్లిక్ అయ్యాడు.