పవన్ కు ఎప్పుడూ ఆర్థిక కష్టాలు ఉంటాయి

పవన్ కల్యాణ్ ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, ఒక దశలో తన స్టాఫ్ కు జీతాలు కూడా ఇవ్వలేకపోయారనే వార్తలు గతంలో చాలానే విన్నాం. కేవలం డబ్బుల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఓ ఖరీదైన…

పవన్ కల్యాణ్ ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, ఒక దశలో తన స్టాఫ్ కు జీతాలు కూడా ఇవ్వలేకపోయారనే వార్తలు గతంలో చాలానే విన్నాం. కేవలం డబ్బుల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఓ ఖరీదైన కారును కూడా ఆయన అమ్మేశారని విన్నాం. అంతెందుకు.. గోపాల గోపాల అనే సినిమాను కూడా కేవలం డబ్బుల కోసమే పవన్ చేశారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

వీటిపై పవన్ ఆప్తుడు, గోపాల గోపాల దర్శకుడు శరత్ మరార్ స్పందించారు. పవన్ కు ఎప్పటికప్పుడు ఆర్థిక కష్టాలు ఉంటూనే ఉంటాయంటున్నారు శరత్ మరార్. అయితే గోపాల గోపాల సినిమా చేయడానికి అది కూడా ఓ కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

“పవన్ ఎప్పుడూ ఆర్థిక సమస్యల్లో ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ డబ్బును పట్టించుకోలేదు. ఆయన అలా ఫ్లోలో వెళ్తుంటారు. బహుశా పవన్, గోపాల గోపాల సినిమా చేయడానికి అది కూడా ఓ కారణం కావొచ్చు. కానీ గోపాలగోపాల సినిమాను ఆయన కథ నచ్చి చేశారు. ఆర్థిక సమస్యలతో కాదు. నచ్చకపోతే ఆయన ఏదీ చేయరు.”

ఇలా పవన్ కల్యాణ్ ఆర్థిక సమస్యలపై శరత్ మరార్ స్పందించారు. జానీ టైమ్ లోనే తనకు పవన్ తో పరిచయమైందన్న శరత్ మరార్.. తను ఆ టైమ్ లో కలిసిన వ్యక్తుల్లో అత్యంత విలక్షణమైన వ్యక్తిగా పవన్ ను చెప్పుకొచ్చారు.

“పవన్ కల్యాణ్ ను నాకు అల్లు అరవింద్ పరిచయం చేశారు. అప్పుడు నేను ఓ యాడ్ కోసం చిరంజీవి గారితో అసోసియేట్ అయి ఉన్నాను. అదే టైమ్ లో జానీ ప్రీ-ప్రొడక్షన్ నడుస్తోంది. ఆ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేయమని అరవింద్ గారు అడిగారు. అలా కల్యాణ్ గారికి, నాకు పరిచయమైంది. మా ఫస్ట్ మీటింగ్ చాలా బాగా జరిగింది. అప్పటివరకు నేను చూసిన కలిసిన వ్యక్తుల్లో చాలా డిఫరెంట్ వ్యక్తి పవన్ కల్యాణ్ అనే విషయాన్ని మొదటి మీటింగ్ లోనే గ్రహించాను. జానీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను. అక్కడ్నుంచి మా ప్రయాణం మొదలైంది.”

ఎదుటి వ్యక్తి తన గురించి ఏమనుకుంటున్నాడనే ఆలోచన, భయం పవన్ కు ఎప్పుడూ లేవంటున్నారు శరత్ మరార్. పాలిటిక్స్ లోకి కంప్లీట్ గా వెళ్లిన తర్వాత పవన్ తో కాంటాక్ట్ తగ్గిందని.. అంతే తప్ప తమ మధ్య ఎలాంటి అభిప్రాయబేధాల్లేవని అంటున్నారు. రాజకీయాల్లో పవన్ తనకంటూ ఓ మార్గం ఏర్పరుచుకున్నారని.. కచ్చితంగా ప్రభావం చూపిస్తారని నమ్ముతున్నారు శరత్ మరార్.