నా చెల్లి భ‌ర్త‌తో ఆమెకి వివాహేత‌ర సంబంధం…

రాజ్‌కుంద్రా …ప్ర‌ముఖ వ్యాపార‌వేత్తగా కంటే వెండితెర అంద‌గ‌త్తె శిల్పాశెట్టి భ‌ర్త‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. శిల్పా శెట్టితో ఆయ‌న‌కు రెండో వివాహం. అంత‌కు ముందు క‌విత అనే యువ‌తితో రాజ్‌కుంద్రాకు వివాహం, అనంత‌రం విడాకులు తీసుకున్నారు.…

రాజ్‌కుంద్రా …ప్ర‌ముఖ వ్యాపార‌వేత్తగా కంటే వెండితెర అంద‌గ‌త్తె శిల్పాశెట్టి భ‌ర్త‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. శిల్పా శెట్టితో ఆయ‌న‌కు రెండో వివాహం. అంత‌కు ముందు క‌విత అనే యువ‌తితో రాజ్‌కుంద్రాకు వివాహం, అనంత‌రం విడాకులు తీసుకున్నారు. అయితే 12 ఏళ్ల త‌ర్వాత క‌విత‌తో విడాకుల‌కు దారి తీసిన సంచ‌ల‌న విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. తాజాగా ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న మొద‌టి వివాహం విచ్ఛిన్నం కావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు.

త‌న చెల్లి భ‌ర్త‌తో మొద‌టి భార్య క‌విత‌కు వివాహేత‌ర సంబంధం ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డం వ‌ల్లే విడాకులు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. శిల్పాశెట్టి విడాకుల‌కు సంబంధించిన చెప్పిన సంచ‌ల‌న విష‌యాలు బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపు తున్నాయి. ఆ ఇంట‌ర్వ్యూలో రాజ్‌కుంద్రా ఏం చెప్పారో ఆయ‌న మాట‌ల్లోనే…

‘నా మొదటి భార్య కవితతో విడిపోవడానికి శిల్పాశెట్టి అస్సలు కారణం  కాదు. కొన్నేళ్ల క్రితం మేము లండన్‌లో నివాసం ఉన్నాం. నా తల్లిదండ్రులతోపాటు చెల్లి, ఆమె భర్త కూడా మాతోనే ఉండేవారు. నా చెల్లి భర్తతో క‌విత‌కు సాన్నిహిత్యం పెరిగింది. నేను ఎప్పుడైనా వ్యాపార ప‌నుల‌పై టూర్‌కి వెళ్తే.. కవిత ప్రవర్తన మారేది. నా చెల్లి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. ఆఖరికి మా కారు డ్రైవర్‌ కూడా వాళ్ల గురించి అసభ్యంగా చెప్పాడు.

దాంతో మా చెల్లి, ఆమె భర్తను భారత్‌కు పంపించాం. అయినా సరే కవిత అతడితో సంబంధాలు కొన‌సాగించింది. రహస్యంగా ఒక సెల్‌ఫోన్‌లో అతనికి తరచూ మెస్సేజ్‌లు చేసేది. ఒకసారి ఆ ఫోన్ నా కంట పడింది. రంకు బ‌య‌ట‌ప‌డింది. సెల్‌ఫోన్‌లో మెస్సేజ్‌లు చూసి నా హృదయం ముక్కలైంది. దాంతో కవిత నుంచి విడాకులు తీసుకోవాల్సివ‌చ్చింది. నా గురించి శిల్పకు అన్ని తెలుసు. అలా, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’ అని రాజ్‌కుంద్రా వివరించారు.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతూనే తెలుగులో ‘సాహసవీరుడు సాగరకన్య’, ‘వీడెవడండీ బాబు’,‘ఆజాద్’,‘భలేవాడివి బాసు’ వంటి  కొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అల‌రించింది. సాహసవీరుడు సాగరకన్యలో చేపపిల్లలా శిల్పాశెట్టి అభిన‌యానికి ,అందానికి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉండ‌గా కథానాయిక శిల్పాశెట్టి కుటుంబ సభ్యులంద‌రూ కరోనాబారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ అందరూ కోలుకున్నారు.