పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయి, కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాపై ఇప్పుడు కొత్తగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాజ్ కుంద్రాతో కలిసి పనిచేసిన అడల్ట్ చిత్రాల హీరోయిన్ షర్లీన్ చోప్రా స్వయంగా ఈ ఆరోపణలు చేయడం విశేషం. కేవలం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఈమె ఆగలేదు. రాజ్ కుంద్రా, శిల్పా షెట్టి మధ్య అభిప్రాయబేధాలున్నాయని, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయంటూ బాంబ్ పేల్చింది ఈ బ్యూటీ.
రాజ్ కుంద్రా అరెస్ట్ కు సంబంధించి ఆ కేసులో భాగస్వామిగా ఉన్న షెర్లీన్ చోప్రాను పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు రికార్డ్ చేసిన స్టేట్ మెంట్ లో షెర్లీన్ చోప్రా ఈ ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.
2019 మార్చిలో రాజ్ కుంద్రాతో బిజినెస్ మీటింగ్ జరిపింది షెర్లీన్ చోప్రా. అదే నెల 27వ తేదీన చెప్పాపెట్టకుండా షెర్లీన్ చోప్రా ఇంటికొచ్చాడట కుంద్రా. లోపలికి వస్తూనే, ఏదో మెసేజ్ గురించి గొడవ పెట్టుకున్నాడట. పనిలోపనిగా తనకు, తన భార్య శిల్పాషెట్టికి ఘర్షణ జరిగిందని కూడా చెప్పాడట.
ఇలా చెప్పిన వెంటనే షెర్లీన్ ను గట్టిగా హత్తుకున్నాడట కుంద్రా. ఆ తర్వాత ముద్దులతో ముంచెత్తడం మొదలుపెట్టాడట. షెర్లీన్ వెంటనే అందుకు నిరాకరించిందట. పెళ్లయిన పురుషులతో, మరీ ముఖ్యంగా బిజినెస్ పార్టనర్స్ తో తను రిలేషన్ షిప్ పెట్టుకోనని చెప్పిందట. అయినప్పటికీ మాట వినని కుంద్రా, షెర్లీన్ ను బలవంతం పెట్టాడట. దీంతో షెర్లీన్ భయపడి బాత్రూమ్ కు వెళ్లి దాక్కుందట.
షెర్లీన్ ఆరోపణలతో కుంద్రాపై ఇప్పుడు మరో కొత్త కేసు నమోదయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కుంద్రా సంపాదనపై మరో కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ 5 నెలల కాలంలో తన అడల్ట్ యాప్ ద్వారా కుంద్రా కోటి 17 లక్షల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇక ఈ కేసుకు సంబంధించి కుంద్రా భార్య, నటి శిల్పాషెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తపై, అతడి కేసుకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో వార్తలు వస్తున్నాయని, వాటిని నిలువరించాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కొన్ని వార్తా క్లిప్పింగులను కూడా ఆమె తన పిటిషన్ కు జోడించారు.