cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

శోభ‌నం రాత్రి ఇంటి నుంచి బ‌య‌టికెళ్లి .,..చివ‌రికి?

శోభ‌నం రాత్రి ఇంటి నుంచి బ‌య‌టికెళ్లి .,..చివ‌రికి?

శోభ‌నం రాత్రి ఇంటి నుంచి బ‌య‌టికెళ్లిన వ‌రుడు చివ‌రికి ప్రాణాల‌తో తిరిగి రాలేదు. అదే అత‌నికి చివ‌రి రాత్రి అయింది. న‌ల్ల‌గొండ జిల్లా శాలిగౌరారం మండ‌లం మ‌నిమ‌ద్దె గ్రామంలో ఈ దుర్ఘ‌టం చోటు చేసుకుంది. దీంతో రెండు వైపుల కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెల‌కుంది. 

మ‌నిమ‌ద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంత‌మ్మ చిన్న కుమారుడు సోమేశ్ అలియాస్ సోమయ్య (27)కు ఈ నెల 3న నాగారం మండ‌లం ఫణిగిరి నివాసైన త‌న మేన‌మామ కూతురితో పెళ్లి జ‌రిగింది.

సంప్ర‌దాయం ప్ర‌కారం 11వ రోజు శోభ‌నం ఏర్పాటు చేశారు. స్నేహితుల‌ను క‌లిసి వ‌స్తాన‌ని భార్య‌కు చెప్పి సోమేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంత సేప‌టికీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబంలో టెన్ష‌న్ మొద‌లైంది. సోమేశ్‌కు అత‌ని అన్న ఫోన్ చేశాడు. కానీ సోమేశ్ కాల్ రిసీవ్ చేసుకోలేదు. బాగా పొద్దు పోవ‌డంతో సోమేశ్ స్నేహితులు ఇంటికి వెళ్లిపోయారు.

తాను కూడా ఇంటికి వెళ్తున్న‌ట్టు సోమేశ్ త‌న స్నేహితుల‌కు చెప్పాడు. అనంత‌రం అత‌ను ఇంటికి మాత్రం వెళ్ల‌లేదు. గ్రామంలో ఎవ‌రూ నివాసం ఉండ‌క‌పోవ‌డంతో నిరుప‌యోగంగా ఉన్న పూరింట్లోకి వెళ్లాడు. అనంత‌రం అక్క‌డే ఉరి వేసుకున్నాడు. మ‌రో వైపు సోమేశ్ కోసం కుటుంబ స‌భ్యులు తెల్ల‌వార్లు వెతుకుతూనే ఉన్నారు. సోమేశ్ రాక కోసం ఆ న‌వ వ‌ధువు రాత్రంతా ఎదురు చూస్తూ ఉండిపోయింది.

తెల్లారి సోమేశ్ స్నేహితుల‌ను ఆరా తీయ‌గా ...ఇంటిక‌నే బ‌య‌ల్దేరిన‌ట్టు చెప్పారు. చివ‌రికి పూరిగుడిసెలో విగ‌త జీవిగా వేలాడుతూ క‌నిపించ‌డంతో కుటుంబ సభ్యుల వేద‌న వ‌ర్ణ‌నాతీతం.  శోభ‌నానికి ఎదురు చూస్తున్న న‌వ వ‌ధువుకి భ‌ర్త ఇక ప్రాణాల‌తో లేడ‌నే తెలియ‌డంతో క‌న్నీరుమున్నీరైంది.

అస‌లు ఆ రాత్రి ఇంటి నుంచి ఎందుకు పోవాల్సి వ‌చ్చింది? ఎవ‌రైనా ప‌థ‌కం ప్ర‌కారం ఫోన్ చేసి ర‌ప్పించి, ప్రాణాలు తీశారా?  లేక మ‌రేదైనా కార‌ణంతో బ‌ల‌వన్మ‌ర‌ణం చెందాడా? ఇలా అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. పోలీసుల ద‌ర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూసే అవ‌కాశాలున్నాయి.

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

 


×