Advertisement

Advertisement


Home > Movies - Movie News

షూటింగ్ లకు అనుమతి ఇచ్చేస్తే?

షూటింగ్ లకు అనుమతి ఇచ్చేస్తే?

సినిమా కార్మికులు వేలాది మందికి పని కల్పించడానికి వీలయ్యే షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ పెద్దలు పలువురు కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయనను కలిసిన తరువాత, కలువక ముందు కూడా జూన్ ఒకటి నుంచి షూటింగ్ లు వుంటాయనే వినిపిస్తోంది. అలాగే ఇండస్ట్రీ జనాలు పరోక్షంగా కోరుకుంటున్నట్లే జూలై నుంచో ఆగస్టు నుంచో థియేటర్లు ఓపెన్ అవుతాయని వార్తలు వచ్చాయి.

సరే, షూటింగ్ లు ప్రారంభం అవుతాయి. కానీ పెద్ద హీరోలు అందరూ చకచకా షూటింగ్ లకు వస్తారా? ఇదే అనుమానం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గ్యాసిప్ ల ప్రకారం. వ్యాక్సీన్ వచ్చే వరకు రానాను షూటింగ్ కు వెళ్లవద్దని దగ్గుబాటి సురేష్ బాబు చెప్పారని తెలుస్తోంది. అలాగే తాను కూడా ఇప్పట్లో నారప్ప షూటింగ్ కు వచ్చేది లేదని హీరో వెంకటేష్ స్పష్టం చేసారని వినిపిస్తోంది. నాగార్జున కూడా కనీసం రెండు మూడు నెలల వరకు తాను రావడం సాధ్యపడదని చెప్పినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కరోనా కు సంబంధించి ఇంటి దగ్గర చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేసుకున్నారు. అపోలో సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన శానిటైజర్ ఛాంబర్ ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని జాగ్రత్తలతో మరి ఆయన బయటకు వచ్చి ఆచార్య షూటింగ్ కొనసాగిస్తారేమో చూడాలి. యంగస్టర్స్ కు, అలాగే ఇమ్యూనిటీ బాగా వున్నవాళ్లకు ఏ భయం లేదని వైద్యులు చెబుతున్నారు. అందుకే రామ్ చరణ్, ఎన్టీఆర్ ధైర్యంగా షూటింగ్ లకు వచ్చే అవకాశం వుంది. 

ఇదిలా వుంటే వినిపిస్తున్న మరో సంగతి ఏమిటంటే, నిర్మాణంలో వున్న పెద్ద సినిమాలు లేదా పెద్ద హీరోల సినిమాలు అన్నీ షూటింగ్ ప్లాన్ లను మార్చుకుంటున్నాయన్నది. అంటే హీరోలతో సంబంధం లేకుండా వుండే సీన్లు అన్నీ ఇప్పుడు సెపరేట్ చేసి, ముందుగా అవి షూట్ చేసుకుంటారు.ఇలా ఓ రెండు నెలలు గడిచాక సీనియర్ హీరోలు ధైర్యంగా సెట్ లోకి అడుగు పెడతారు. సీనియర్ హీరోలు అంతా 60 దాటేసిన వారే. కరోనా రిస్క్ 60 దాటిన వారికే అని ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే సీనియర్లు మాత్రం ఇప్పట్లో షూటింగ్ లకు రాకపోవచ్చు అని టాక్. 

ఇదిలా వుంటే గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ క్రాక్ సినిమాకు అయిదారు రోజులు బ్యాలెన్స్ వర్క్, ఒకటి రెండు పాటల చిత్రీకరణ వుంది. చైతన్య లవ్ స్టోరీకి ఎంత వర్క్ బ్యాలన్స్ వుందన్నది క్లారిటీగా తెలియదు. సాయి తేజ్ సోలో బతుకే, అఖిల్ బ్యాచులర్, నితిన్ రంగ్ దే సినిమాలు సగానికి పైగా పూర్తయ్యాయి. ఇవన్నీ డిసెంబర్ వేళకు రెడీ అవుతాయి.

ఏమైనా సినిమాలు అన్నీ అక్టోబర్, డిసెంబర్, జనవరి విడుదల టార్గెట్ గా తయారయ్యే అవకాశం వుంది. అక్టోబర్ లోపల కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు మహా అయితే మూడు నాలుగు మించి విడుదల కాకపోవచ్చు.

త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ న్యూస్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?