తగ్గిన కరోనా కేసులు.. సెట్స్ పైకొస్తున్న హీరోలు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హీరోలంతో తమ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా అందరికంటే ముందుగా నితిన్…

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హీరోలంతో తమ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా అందరికంటే ముందుగా నితిన్ బయటకొచ్చాడు.

నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. నితిన్, తమన్న మధ్య వచ్చే సన్నివేశాల్ని తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తో మ్యాస్ట్రో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. 

అటు మరో హీరో నిఖిల్ కూడా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 18 పేజెస్, కార్తికేయ-2 సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తానని నిఖిల్ ప్రకటించాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్.. చందు మొండేటి డైరక్షన్ లో కార్తికేయ-2 సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అటు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తిమ్మరుసు, రవితేజ చేస్తున్న ఖిలాడీ సినిమాలు కూడా ఈ వారంలోనే సెట్స్ పైకి రాబోతున్నాయి. నాని కూడా షూటింగ్ కు రెడీ అని ప్రకటించాడు. కాకపోతే శ్యామ్ సింగరాయ్ సెట్ డ్యామేజ్ అయింది. అది రెడీ అయిన వెంటనే షూట్ స్టార్ట్ అవుతుంది.

అయితే పెద్ద సినిమాలు మాత్రం స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఈ నెలాఖరుకు గానీ సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. అటు సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ పై మహేష్ బాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు సీసీసీ ఆధ్వర్యంలో సినీకార్మికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. శనివారం నాటికి 4వేల మందికిపైగా సినీకార్మికులు కరోనా టీకా తీసుకున్నారు. 24 విభాగాలకు చెందిన కార్మికులు, టెక్నీషియన్స్ అందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన తర్వాత పెద్ద సినిమాలన్నీ ఒకేసారి సెట్స్ పైకి రాబోతున్నాయి.