Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ స్టార్ హీరోల‌ను ఆకాశానికెత్తిన శ్రియ‌!

ఆ స్టార్ హీరోల‌ను ఆకాశానికెత్తిన శ్రియ‌!

క‌రోనా లాక్ డౌన్లు, షూటింగుల‌కు విరామాల్లో ఇంట‌ర్నెట్ లో ఫ్యాన్స్ తో ముచ్చ‌ట్లు, ఆన్ లైన్ వీడియో ఇంట‌ర్వ్యూల్లో యాక్టివ్ గా ఉంటున్న తార‌ల్లో ఒక‌రు శ్రియ‌. దాదాపు రెండు ద‌శాబ్దాల కింద‌ట కెరీర్ ను ప్రారంభించిన ఈ హీరోయిన్ సౌత్ లో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తోనూ న‌టించింది.

హిందీలో కూడా ప‌లువురు స్టార్ హీరోల సినిమాల్లో క‌నిపించింది. ఒక విదేశీయుడిని చేసుకుని ప్ర‌స్తుతం బార్సిలోనాలో నివ‌సిస్తోంది శ్రియ‌. ఇప్ప‌టికీ ఆమెకు అవ‌కాశాలు అయితే మ‌రీ క‌రువైపోలేదు! చేతిలో భారీ సినిమాలే ఉన్న‌ట్టున్నాయి.

హీరోయిన్ గా త‌న వ‌ర్క్ ఎక్స్ పీరియ‌న్స్  ల‌ను వివ‌రిస్తూ.. ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను ఆకాశానికెత్తింది శ్రియ‌. నాగార్జున‌, ర‌జ‌నీకాంత్.. వీళ్ల‌తో ప‌ని చేయ‌డం చాలా మ‌ధురానుభూతి అని శ్రియ అంటోంది. త‌న కెరీర్ లో రెండో సినిమానే నాగార్జున‌తో న‌టించిన‌ట్టుగా శ్రియ చెప్పింది. నాగార్జున క‌న్య రాశి వ్య‌క్తి అని, క‌న్య రాశి వాళ్లే గ్రేట్ పీపుల్ అని శ్రియ కితాబిచ్చింది.

ఆయ‌న చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటార‌ని, చాలా పాజిటివ్ వ్య‌క్తి అని, త‌న‌కు చాలా మంచి స్నేహితుడ‌ని, ఏ స‌మ‌యంలో అయినా  మాట్లాడే వ్య‌క్తి అని నాగార్జున‌తో త‌న అనుబంధాన్ని వివ‌రించింది శ్రియ‌. నాగార్జున‌తో ఈమె ప‌లు సినిమాల్లో న‌టించింది. సంతోషం, నేనున్నాను, బాస్, మ‌నం వంటి సినిమాల్లో వీరు జంట‌గా క‌నిపించారు.

ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో శివాజీ సినిమాలో న‌టించింది శ్రియ‌. ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం కూడా గొప్ప జ్ఞాప‌కం అని ఈమె వివ‌రించింది. ర‌జ‌నీ సార్ చాలా గొప్ప వార‌ని, అంద‌రికీ ఒకే త‌ర‌హా గౌర‌వాన్ని ఇస్తార‌ని, స్పాట్ బాయ్ తో కూడా చాలా గౌర‌వంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని శ్రియ వివ‌రించింది. సెన్సాఫ్ హ్యూమ‌ర్ తో ఉండే ర‌జ‌నీకాంత్ గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్య‌క్తి అని శ్రియ చెప్పుకొచ్చింది.

అందరూ కలిసి బైటకి పంపేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?