cloudfront

Advertisement


Home > Movies - Movie News

శ్రుతి హాసన్.. ఆ హీరోయిన్ ను పెళ్లాడేదట!

శ్రుతి హాసన్.. ఆ హీరోయిన్ ను పెళ్లాడేదట!

తమన్నా- శ్రుతి హాసన్ లు తమ మధ్య ఉన్న బంధంలోని గాఢత గురించి చాలా గట్టిగానే చెప్పుకొంటూ ఉన్నారు. తామిద్దరం ఒకరి ప్రేమలో ఒకరు ఉన్నట్టుగా చెప్పుకొంటున్నారు. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే.. తను అబ్బాయిని అయ్యుంటే.. తమన్నానే పెళ్లి చేసుకునేదాన్ని అని శ్రుతి హాసన్ చెప్పుకోవడం వరకూ!

ఇంతలా నచ్చేశారట ఈ హీరోయిన్లు ఒకరికి ఒకరు! ఇది వరకూ కూడా ఈ తరహా సంభాషణ చేశారు వీరిద్దరూ. అప్పుడు శ్రుతి హాసన్ మీద తమన్నా తన ప్రేమను చాటుకుంది. ఆమె తన అభిమానపాత్రురాలు అని తమన్నా ప్రకటించుకుంది. శ్రుతి హాసన్ తనకు అత్యంతి ఇష్టమైన చెలి అని తమన్నా చెప్పుకొచ్చింది.

ఇప్పుడు శ్రుతి మరో అడుగుకు ముందుకు వేసి.. తను అబ్బాయిగా పుట్టి ఉంటే.. తమన్నాతోనే పెళ్లి అంటోంది. అయినా శ్రుతికి ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టే కదా. అమ్మాయే కాబట్టి పెళ్లికి ఛాన్స్ లేదనే చెప్పాలి. అయితే పెళ్లి చేసుకునేంత ప్రేమ తామిద్దరి మధ్య ఉందని మాత్రం ఈ హీరోయిన్లు చాటుకొంటూ ఉన్నారు!