cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆమె అప్పుడు ఐరెన్ లెగ్.. ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్

ఆమె అప్పుడు ఐరెన్ లెగ్.. ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్

ఒకప్పుడు ఐరెన్ లెగ్ అన్నారు. ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి తటపటాయించేవాళ్లు. కానీ ఇప్పుడు ఆమె గోల్డెన్ హ్యాండ్ అయింది. వరుసగా ఫ్లాపులొస్తున్న హీరోలు ఎవరైనా శృతిహాసన్ ను తీసుకుంటే.. వాళ్లకు హిట్ గ్యారెంటీ. ఈ విషయం మేం చెప్పడం లేదు. ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరి.

ఓ సారి చెక్ చేద్దాం... పవన్ కల్యాణ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పటివరకు వరుసగా ఫ్లాపులు ఇస్తూ వచ్చాడు పవన్ కల్యాణ్. పులి, తీన్ మార్, పంజా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గబ్బర్ సింగ్ తో ఎట్టకేలకు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్.

ఇంకో ఉదాహరణ చూద్దాం. 1-నేనొక్కడినే, ఆగడు రూపంలో వరుసగా రెండు ఫ్లాపులిచ్చాడు మహేష్ బాబు. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్. 

ఇప్పుడు ముచ్చటగా మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి రవితేజ వంతు. టచ్ చేసి చూడు, నేలటిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా అంటూ వరుసగా 4 ఫ్లాపులిచ్చాడు రవితేజ. ఎట్టకేలకు క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇందులో కూడా హీరోయిన్ శృతిహాసన్.

ఇలా ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లు ఇచ్చే అదృష్టదేవతగా శృతిహాసన్ మారిపోయిందంటూ ఆమె అభిమానులు ఓ రేంజ్ లో ఈ మేటర్ ను వైరల్ చేస్తున్నారు. వీళ్ల లాజిక్ అయితే బాగుంది కానీ, ఈ మేజిక్ ఎన్నాళ్లు పనిచేస్తుందో చూడాలి. 

మరీ ముఖ్యంగా ఆమె హీరోయిన్ గా నటించిన వకీల్ సాబ్ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఆ మూవీ రిజల్ట్ తో ఈ సెంటిమెంట్ లో ఎంత పస ఉందనే సంగతి తేలిపోతుంది.

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

 


×