అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదిలోనే శృతిహాసన్ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయంటోంది బాలీవుడ్ మీడియా. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, అతడ్నే పెళ్లి చేసుకోబోతోందట. శృతి-శాంతను ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటారనేది తాజా టాక్.
ప్రస్తుతం శృతిహాసన్ వయసు 36 సంవత్సరాలు. ఈ వయసు వచ్చిన హీరోయిన్లంతా దాదాపు పెళ్లిళ్లు చేసుకున్నారు. కాజల్ పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది. అలియాభట్ అయితే 28 ఏళ్లకే పెళ్లి చేసుకొని తల్లయింది. కెరీర్ ను కూడా కొనసాగిస్తోంది.
దీంతో శృతిహాసన్ కూడా పెళ్లిపై మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు కెరీర్ ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆమె భావిస్తోంది. బాలీవుడ్ నుంచి ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు కానీ, సౌత్ లో శృతి కెరీర్ కు ఢోకా లేదు.
తమ రిలేషన్ షిప్ ను శృతిహాసన్ దాచిపెట్టలేదు. శంతనూతో ప్రేమలో ఉన్నట్టు ఆమె ఇదివరకే ప్రకటించింది. అంతేకాదు, తనే ముందుగా ఐలవ్ యు చెప్పిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఇప్పుడా ప్రేమను పెళ్లిగా మార్చుకునే ఆలోచనలో ఉంది ఈ ముద్దుగుమ్మ.