శ్యామ్ సింగ్ రాయ్..ఒక భాగమే

మోస్ట్ ప్రామిసింగ్ సినిమాల్లో ఒకటి అయిన హీరో నాని శ్యామ్ సింగ రాయ్ టీజర్ వచ్చింది. పేరుకే టీజర్. కానీ దాదాపు 105 సెకెండ్లు నిడివి వుంది. ఈ నిడివి మొత్తం దాదాపు సినిమాలోని…

మోస్ట్ ప్రామిసింగ్ సినిమాల్లో ఒకటి అయిన హీరో నాని శ్యామ్ సింగ రాయ్ టీజర్ వచ్చింది. పేరుకే టీజర్. కానీ దాదాపు 105 సెకెండ్లు నిడివి వుంది. ఈ నిడివి మొత్తం దాదాపు సినిమాలోని ఒక పర్శ్వానికే కేటాయించారు. సినిమాలో ఒక భాగం అయిన కలకత్తా బ్యాక్ర్ డ్రాప్ ను చూపించారు. 

దేవదాసీలు, విప్లవాత్మక భావాలున్న రచయితగా నాని వీటి మధ్య సంఘర్షణ అద్భుతంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. కలర్, లైటింగ్ మూడ్, సెట్ ప్రాపర్టీలు, గెటప్ లు అన్నీ కలిసి ప్రేక్షకులను ఓ సీజన్ లోకి తీసుకెళ్లేలా కనిపించింది టీజర్.  

స్త్రీ ఎవరికీ దాసి కాదు ఆఖరికి ఆ అమ్మవారికైనా, అనడంలోనే దేవదాసీల వ్యవహారం వుందేమో అనిపిస్తోంది. పైగా రైటర్ గా 'ప్రాస్టిట్యూట్స్' అని టైప్ చేయడం కూడా చూపించారు. నాని, సాయి పల్లవి పక్కా ఇమిడిపోయారు పాత్రల్లో

టీజర్ చివర్లో, రెండో భాగం గురించి చివర్లో కృతిశెట్టి-నాని నడుమ చిన్న సీన్ కట్ చేసి ఆసక్తి జనరేట్ చేసారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలవుతుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాకు రాహుల్ దర్శకుడు.