ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలోకి మరో నటుడు వచ్చి చేరాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బిగ్ బాస్ సీజన్-13 విన్నర్ సిద్దార్థ్ శుక్లాను తీసుకున్నారు. సినిమాలో మేఘనాధుడి పాత్రలో సిద్దార్థ్ కనిపించనున్నాడు.
సిద్దార్థ్ బాలీవుడ్ లో 2-3 సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాల కంటే బిగ్ బాస్ విన్నర్ గానే అతడు ఫేమస్. పైగా నార్త్ లో బుల్లితెరపై అతడో స్టార్. సినిమాలో మేఘనాధ్ పాత్రకు సిద్దార్థ్ సరిపోతాడని భావించిన దర్శకుడు ఓం రౌత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి హైదరాబాద్ లో ఆదిపురుష్ కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వాలి. సిద్దార్థ్ కూడా జాయిన్ అవ్వాలి. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇంకా 90 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు యూనిట్ తెలిపింది. షూటింగ్ ఎప్పుడు మొదలైనా ఈ సినిమాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించాడు. ఆ తర్వాతే సలార్ షూటింగ్ కొనసాగుతుంది.