Advertisement

Advertisement


Home > Movies - Movie News

శింబు పాట..ఈసారి నిఖిల్ కోసం

శింబు పాట..ఈసారి నిఖిల్ కోసం

తమిళ హీరో శింబు కు పాటలు పాడడం హాబీ. తెలుగు హీరోల కోసం అడపా దడపా గొంత సవరించుకుంటూనే వుంటాడు. ఈసారి నిఖిల్ వంతు వచ్చింది. 

ఇటు నిఖిల్ కు అటు సంగీత దర్శకుడు గోపీ సుందర్ కు మంచి ఫ్రెండ్ కావడంతో శింబు ఈ పాట పాడేసాడు. గీతా సంస్థ నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమా కోసం ఈ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసారు. ‘ఇవ్వు పిల్లా..టైమ్ ఇవ్వు పిల్లా’ అంటూ సాగిందీ పాట.

దర్శకుడు సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సూపర్ విజన్ లో ఈ సినిమాను నిర్మించారు. గతంలో సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ ను అందించిన ప్రతాప్ నే ఈ 18 పేజెస్ కు దర్శకుడు. ఒక ఫీల్ గుడ్ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయ2 తో హాట్ పేవరెట్ జోడీగా మారిని నిఖిల్ - అనుపమ నే ఈ 18 పేజెస్ లో జోడీ. ఇదో టిపికల్ లవ్ స్టోరీ. కుమారి 21 ఎఫ్ లో మాదిరిగానే ఇది కూడా ఓ డిఫరెంట్ పాయింట్ తో తయారవుతోంది. ఇటీవల గీతా నుంచి వచ్చిన సినిమాల్లో బ్యాచులర్ తరువాత మళ్లీ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. బన్నీ వాస్ ఈ సినిమాకు నిర్మాత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?